Pawan Kalyan | జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు..! ఆ వ్యాఖ్యలే కారణం..?
Pawan Kalyan | జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఏపీలో మహిళలు కనిపించకుండా అదృశ్యహవుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందిస్తూ జారీ చేసింది.
Pawan Kalyan | జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఏపీలో మహిళలు కనిపించకుండా అదృశ్యహవుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ స్పందిస్తూ జారీ చేసింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. మహిళల అదృశ్యంపై ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని పవన్‌ను కోరింది. అలాగే, ఆ మహిళల వివరాలు ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆదివారం పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని, ఇందుకు వలంటీర్లే కారణమన్నారు. అధికార వైసీపీ పాలనలో 30వేల మందిలో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లతో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారని, ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ జనసేన అధినేతకు నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

