Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు ఇటీవల పార్టీ మారిన విషయం తెలిసిందే.
Andhra Pradesh | పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు ఇటీవల పార్టీ మారిన విషయం తెలిసిందే. వంశీ కృష్ణ జనసేనలోకి వెళ్లగా, రామచంద్రయ్య తెలుగుదేశంలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగమురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన మండలి చైర్మన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. ఎమ్మెల్సీల నుంచి వివరణ సైతం తీసుకున్నారు. సమగ్ర విచారణ తర్వాతే ఇద్దరిపై వేటు వేసినట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీలు ఇద్దరు తమ పదవులను కోల్పోయారు. ఇటీవల ఎనిమిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. వారిలో వైసీపీ నుంచి టీడీపీకి, తెలుగుదేశం నుంచి అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి (వైసీపీ), కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ , మద్దాళి గిరి (టీడీపీ)పై వేటుపడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

