Vangalapudi Anitha | వైఎస్ వివేకాను హత్య చేసిన వారిపై ధర్నా చేయండి.. వైఎస్ జగన్‌పై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్
Vangalapudi Anitha | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో 15 మంది మరణించగా.. ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని గుర్తు చేశారు.
Vangalapudi Anitha | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో 15 మంది మరణించగా.. ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని గుర్తు చేశారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన 17 మంది కుటుంబసభ్యులకు, 36 మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు అందజేశామని తెలిపారు.
తెలిసి తెలియకుండా శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు వైఎస్ జగన్ వ్యవహరించడం బాధాకరమని వంగలపూడి అనిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేసి ప్రమాద బాధితులకు న్యాయం చేశారని తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని.. లేదంటే తానే స్వయంగా ధర్నా చేస్తానని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కూడా అనిత మండిపడ్డారు. బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన వారిపై ధర్నా చేయాలని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రూ.150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
కాగా అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడి గాజువాక పవన్ సాయి, విశాఖ మెడికవర్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనిత శుక్రవారం పరామర్శించారు. బాధితుల బ్యాంక్ ఖాతాలో పరిహారం డబ్బులు జమ చేసినట్లుగా కన్ఫర్మేషన్ ఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

