టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
Ayyanna Patrudu |
అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయ అన్నయ్యపాత్రుడితో పాటు ఆయన తనయుడు రాజేశ్‌ను అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెల్లవారుజామున సీఐడీ పోలీసులు సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం.. నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని, ఈ మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపీసీ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడు, కుమారుడు రాజేశ్‌ను ఏలూరు కోర్టులో ఇద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే, సీఐడీ పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో దొంగల్లా గోడ దూకి వచ్చి, తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
తన చిన్న కొడుకు రాజేశ్ శబ్దాలు విని.. తలుపులు తీసి మీరెవరు ? ఏం కావాలని అడిగితే సమాధానం చెప్పకుండా అయ్యప్ప మాల వేసుకున్న రాజేశ్‌ను ఈడ్చుకొని వెళ్లిపోయారన్నారు. పోలీసులు తాగి వచ్చి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదని పద్మావతి అన్నారు. ప్రభుత్వం నుంచి అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. గతంలో అయ్యన్నపాత్రుడి నివాసం దగ్గర ప్రహరీ గోడ విషయంలో వివాదం చెలరేగింది. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా.. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా.. అయ్యన్న కుటుంబానికి ఊరట లభించింది. తాజాగా అదే కేసులు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారంటూ అయ్యన్నపాత్రుడితో రాజేశ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

