రేపటి నుంచి హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
ap assembly|ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా రేపటి నుంచి మొదలు కానున్నాయి. అమరావతిలోని అసెంబ్లీ హాల్లో గవర్నర్
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి హాట్ హాట్‌గా మొదలు కానున్నాయి. అమరావతిలోని అసెంబ్లీ హాల్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బడ్జెట్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించనున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్డీ చట్టం రద్దుపై ఇటీవల ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అనంతరం ఈ సమావేశాలు జరుగనున్నాయి.
రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్ట పరిధిలోకి రాదని, వీటిపై చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదని తీర్పునివ్వడం నివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాలు తయారు చేసే శాసనసభ వ్యవస్థకు అధికారాలు లేవనడంపై అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. కాగా హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని, ఈ తీర్పును శిరసావహించి అమలు చేయాల్సిందేనని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టనున్నారు. అమరావతి రాజధాని అని ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నారు .
దీంతో పాటు వివేకానందరెడ్డి, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అసెంబ్లీ నివాళి అర్పించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

