తిరుపతి: తిరుపతిలోని (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి (Govindarajaswamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavalu) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.