Film Industry | తెలుగు సినీ పరిశ్రమ విజయవాడకు తరలి రావాలి : మంత్రి కందుల దుర్గేశ్
Film Industry | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.
Film Industry : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం & ట్రావెల్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.
సినిమాల చిత్రీకరణ జరిగితే రెవెన్యూ పెరుగుతుందని మంత్రి చెప్పారు. టికెట్ల ధరలు పెంచాలని అడుగుతున్నారని, తెలుగు సినిమాలకు తప్పకుండా సహకారం అందిస్తామని, అంతకంటే ముందు చిత్ర పరిశ్రమ విజయవాడకు తరలివస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, అందుకే పీపీపీ విధానంపై దృష్టిపెడుతున్నామని తెలిపారు. అందరి సలహాలు తీసుకొని అందరికీ అనుకూలంగా ఉండేలా త్వరలో టూరిజం పాలసీ తీసుకొస్తామని చెప్పారు.
స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రాష్ట్రానికి త్వరలో రూ.1000 కోట్లు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి దుర్గేశ్ చెప్పారు. రాష్ట్రంలో భారీ తీర ప్రాంతం ఉన్నా బ్లూ ఫాగ్ బీచ్ ఒక్కటే ఉందని అన్నారు. మిగిలిన బీచ్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాలపై అందరూ కలసి ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతాల అసలైన పేర్లను సినిమాల్లో ప్రస్తావించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతాల గురించి అందరికీ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

