AP Assembly | పంచెకట్టులో డిప్యూటీ స్పీకర్.. నేత చీరలో మహిళా ఎమ్మెల్యే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..!
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చారు.
AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
ముందుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాధవి మాట్లాడుతూ.. చక్కటి పంచెకట్టులో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలిపారు అంటూ ప్రశంసించారు. అనంతరం ఆమె చేనేత రంగం పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యంగా నేతన్నలు మార్కెటింగ్ విషయంలో వెనుకబడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలా ఎమ్మెల్యే మాధవి సుదీర్ఘంగా చేనేత రంగ సమస్యలు ప్రస్తావిస్తుండగా.. రఘురామ కృష్ణంరాజు కలుగజేసుకుని, ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి సుదీర్ఘ చర్చ అవసరం లేదన్నారు. మీ ప్రశ్నను నేరుగా అడగాలని సూచించారు. దాంతో నాగ మాధవి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసి ప్రశ్నను ముగించారు. ఈ సందర్భంగా రఘురామ.. మీరు కట్టుకున్నది చేనేత చీరేనా..? అని ప్రశ్నించారు. దాంతో మాధవి అవునని సమాధానమిచ్చారు. ఆ క్షణంలో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

