AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
AP Election Results | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కూటమి, ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుపు హవా కొనసాగించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కూటమి, ఎంపీటీసీ (MPTC) , జడ్పీటీసీ ( ZPTC) ఎన్నికల్లోనూ గెలుపు హవా కొనసాగించింది. ప్రత్యర్థి వైసీపీ ( YCP ) అభ్యర్థులు అనేక చోట్ల ఓటమి పాలయ్యారు. అన్ని జిల్లాలోనూ మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిం చారు. 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై ఓట్ల లెక్కింపు మధ్యాహ్నాం వరకు దాదాపు సగం ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 229, జనసేన 20, బీజేపీ 7, వైసీపీ 8, ఇతరులు రెండు చోట్ల జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపొందారు.
3,459 చోట్ల టీడీపీ, 318 చోట్ల జనసేన, 87 చోట్ల బీజేపీ, 521 చోట్ల వైసీపీ, 37 చోట్ల ఇతరులు ఎంపీటీసీలుగా విజయం సాధించారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నియోజవర్గం పులివెందులలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. నగరిలో టీడీపీ అభ్యర్థి రాధిక గెలుపొందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Alliance
- Amravati
- Dominations
- MPTC
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

