Actor Ali | రాజకీయాలకు అలీ గుడ్‌బై .. ఇకపై సినిమాలు చేసుకుంటా
Actor Ali | సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ ( Actor Ali ) రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఇకపై సామాన్యుడిగానే ఉంటానని పేర్కొన్నారు.
అమరావతి : సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ ( Actor Ali ) రాజకీయాలకు(Politics) గుడ్ బై చెప్పాడు. ఇకపై సామాన్యుడిగానే ఉంటానని పేర్కొన్నారు. సినిమాలు, షూటింగ్(Shootings) లు చూసుకుంటానని వెల్లడించారు. 20 ఏండ్ల పాటు తెలుగుదేశం పార్టీ (TDP) లో పనిచేశానని, ఆ తరువాత వైసీపీ(YCP) లోకి వచ్చానని తెలిపారు. 40 ఏండ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నానని, నా సేవకు రాజకీయం తోడైతే పదిమందికి సాయమవుతుందని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
2019లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్(Electronic Media Advisor) గా నియమించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్కుగాని, అసెంబ్లీకి గాని అవకాశం వస్తుందని భావించారు. టికెట్ రాకపోవడంతో ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు.
సీతాకొక చిలుక సినిమా ద్వారా బాలనటుడి సినీ రంగం ప్రవేశించిన అలీ వందలాది చిత్రాల్లో హాస్యనటుడిగా నటించారు. పలు చిత్రాల్లోనూ హీరోగా నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన యమలీల సినిమా సూపర్, డూపర్ హిట్‌గా నిలిచింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

