లక్షణమైన గొర్రె!
ఆ మధ్య మహారాష్ట్రలో మాడ్గల్జాతికి చెందిన ఓ గొర్రె.. రూ.70 లక్షల దాకా ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్ని అరుదైన జాతులకు చెందిన గొర్రెలకు రేటు భారీగా ఉంటుంది. అలాంటి మేలురకం గొర్రెలను పెంచుతూ.. భారీ లాభాలను ఆర్జిస్తున్నాడు కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు. గొర్రెల పెంపకాన్ని మరో మెట్టు ఎక్కిస్తున్నాడు.
- మేలుజాతి రకాలతో అధిక లాభం
- ఒక్కోటి ‘లక్ష’ రూపాయల దాకా విక్రయం
ఆ మధ్య మహారాష్ట్రలో మాడ్గల్జాతికి చెందిన ఓ గొర్రె.. రూ.70 లక్షల దాకా ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్ని అరుదైన జాతులకు చెందిన గొర్రెలకు రేటు భారీగా ఉంటుంది. అలాంటి మేలురకం గొర్రెలను పెంచుతూ.. భారీ లాభాలను ఆర్జిస్తున్నాడు కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు. గొర్రెల పెంపకాన్ని మరో మెట్టు ఎక్కిస్తున్నాడు.
ఒక్కో గొర్రె ధర రూ.లక్ష..! అవును మీరు చదివింది నిజమే! అన్ని మార్కెట్లలో ఒక్కో గొర్రె రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ దొరుకుతుంది. కానీ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట గ్రామానికి చెందిన వహీద్ క్షేత్రంలో మాత్రం.. అంతకు పదింతలు పలుకుతుంది. గొర్రెలను ఫ్యాషన్‌గా పెంచి రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకూ విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో ఉద్యోగం చేసిన వహీద్, గొర్రెల పెంపకంపై ఇష్టంతో స్వగ్రామానికి వచ్చేశాడు. మాచర్ల బ్లాక్ అండ్ వైట్, వెంబూర్ (తమిళనాడు), మచ్చ (కర్ణాటక), కశ్మీర్, హర్టెల్ (మహారాష్ట్ర), మాచర్ల జడ్ బ్లాక్ వంటి అరుదైన గొర్రె పొట్టేళ్లను పెంచుతున్నాడు. ఆయా రాష్ర్టాల నుంచి పిల్లలను తీసుకొచ్చి, వాటికి పౌష్టికాహారం అందిస్తూ ఏడాదిపాటు పెంచుతాడు. బలిష్ఠంగా తయారైన గొర్రెలను అధిక ధరలకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు.
సామాజిక మాధ్యమాలే!
కాలం మారింది. గొర్రెలను సంతల్లో అమ్మడం నిన్నటి మాట. ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల్లో చూసి.. గొర్రెలను కొనేవారు ఎంతోమంది. వహీద్ పెంచుతున్న గొర్రెలను సామాజిక మాధ్యమాలే వేదికలుగా చేసుకొని అమ్ముతున్నాడు. వాటికి ప్రతి వారం, పది రోజులకు శుభ్రంగా స్నానం చేయించి, అందంగా ముస్తాబు చేస్తాడు. వీడియోలు, ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పెడతాడు. ఆ ఫొటోలు, వీడియోలు చూసి, వాటిని కొనుగోలు చేయడానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు. రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తుంటారు. దీంతో తాను అనుకున్న ధరల్లోనే వాటిని విక్రయిస్తున్నాడు వహీద్.
సాధారణ గొర్రెలతోనూ..
మాంసం కోసం ఉపయోగించే గొర్రెలను పెంచినా మంచి లాభాలు వస్తాయని అంటున్నాడు వహీద్. మూడు నెలల గొర్రెపిల్లలను తీసుకువచ్చి మంచి దాణా పెట్టి పెంచితే.. కేవలం నాలుగు నెలల్లోనే ఒక్కో గొర్రెపై కనీసం రూ.4 వేల నుంచి రూ. 5వేల దాకా లాభాలు వస్తాయని చెబుతున్నాడు. పద్ధతి ప్రకారం గొర్రెలను పెంచడం లాభదాయకమనీ, ముఖ్యంగా బక్రీద్ పండుగ సమయంలో రెట్టింపు ఆదాయం ఖాయమనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
నచ్చితే ఎంత ధరైనా..
మనం పెంచే గొర్రె రూపం నచ్చితే ఎంత డబ్బయినా పెట్టి కొనేవారు వేల సంఖ్యలో ఉన్నారు. నేను ఏడాది కిందే ఈ వ్యాపారంలో అడుగుపెట్టాను. మొన్నటి బక్రీద్‌కు నా దగ్గర ఉన్న మాచర్ల జడ్ బ్లాక్ గొర్రెను లక్షా నాలుగు వేల రూపాయలకు విక్రయించా. మాచర్ల బ్లాక్ అండ్ వైట్ గొర్రెను రూ.70వేలకు, మాచర్ల చుక్కల జాలి రకం గొర్రెను రూ. 65వేలకు కొనుక్కెళ్లారు. నా దగ్గర పది రకాల గొర్రెలు ఉన్నాయి. వాటిలో కొన్ని కర్ణాటక, మరికొన్ని మధురై, ఇంకొన్ని మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చా. యువకులు ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే.. నేను ఉచితంగా గైడ్ చేస్తాను. మంచి లాభాలు ఉంటాయి. సొంతంగా పని చేసుకోవాలనుకునే వారికి పూర్తిగాసహకరిస్తా.
– ఎం.ఎ. వహీద్.
బొజ్జ శివకుమార్
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- Sheep farming
- Sheeps
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

