Mushroom Farming | పుట్టగొడుగుల పెంపకంతో లాభాలు ఇలా..!
పుట్టగొడుగులు.. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న పోషకాహారం. పుట్టగొడుగుల్లో కెలరీలు తక్కువగా.. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోగానీ, కుటురపరిశ్రమగాగానీ పెంచి లాభాలు...
Mushroom Farming | పుట్టగొడుగులు.. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న పోషకాహారం. పుట్టగొడుగుల్లో కెలరీలు తక్కువగా.. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ బీ, విటమిన్ డీ, పొటాషియం, కాపర్, ఐరన్, సెలెనియం తోపాటు స్పెషల్ న్యూట్రియంట్ కోలిన్ కూడా దొరుకుతాయి. కండరాల కదలికలు, జ్ఞాపకశక్తికి ఈ స్పెషల్ న్యూట్రియంట్ బాగా ఉపయోగపడుతుంది. వీటిలో క్రొవ్వు, పిండి పద్ధారం తక్కువగా ఉండి.. మాంనసకృత్తులు అధికంగా ఉండటం వలన పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్నారులకు మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదొక ప్రత్యామ్న ఆహారంగా వైద్యులు సూచిస్తున్నారు. వీటిని ఇంట్లోగానీ, కుటురపరిశ్రమగాగానీ పెంచి లాభాలు గడించొచ్చు.
ఎన్ని రకాలంటే..
మన దేశంలో తెల్ల గుండి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు ఎక్కువగా లభిస్తున్నాయి. వీటి పెంపకానికి వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించాలి. 85-90 శాతం తేమ, 16-18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, కంపోస్టు ఎరువు అవసరమవుతుంది. జూన్ నుంచి ఫిబ్రవరి మాసాల వరకు వీటి పెంపకానికి అనువైన కాలం. వ్యవసాయ వ్యర్థ పదార్ధాలైన గడ్డి, చొప్ప ఇతర పదార్థాలతో వీటిని పెంచవచ్చు. 35 – 40 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది.
ఎంత స్థలం కావాలంటే..
పుట్టగొడుగుల పెంపకానికి 6 X 6 స్థలం సరిపోతుంది. సూర్యకాంతి చేరని చోట, ఉష్ణోగ్రత 15 – 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. విత్తనం తయారీ మూడు దశల్లో జరుగుతుంది. మొదటగా జొన్నల నుంచి కల్చరును తయారు చేస్తారు. దాన్ని పరిశుభ్రమైన జొన్నలతో చేర్చితే మైసీలియం తయారవుతుంది. ఈ మైసీలియం వ్యాపించిన జొన్నలను విత్తనం లేదా స్పాన్ అంటారు. స్పాన్ ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత దిగుబడి వస్తుంది.
వ్యాదుల నివారణ..
పుట్టగొడుగులను ఆశించే చీడపీడలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడం, పెంపకానికి ఉపయోగించే బెడ్లను క్రిమికీటకాలు సోకకుండా కాపాడుకోవటం ప్రధాన అంశం. లేకుంటే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసివేసి, ఆ ప్రదేశాలలో బావిస్టిన్ (0.1 శాతం) పిచికారి చేయాలి. బెడ్స్‌లో దోమ కన్పించినట్లయితే వేప ద్రావణాన్ని (5 మి. లీ. / లీ. నీటికి) కలిపి చల్లాలి. బాక్టీరియా మచ్చలు కనిపేస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్ రూపింగ్ గదిలో ఎప్పటికప్పడు ఫార్మలిన్ 5% ద్రావణాన్ని పిచికారి చేస్తూ ఉండాలి.
నిల్వ చేసుకోవడమిలా..
ఒకసారి పుట్టగొడుగులను కోసిన తర్వాత 24 గంటలకు మించి నిల్వ ఉండవు. నిల్వ ఉంచాలనుకుంటే తగిన విధంగా శుద్ధి చేసి ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. తాజా పుట్టగొడుగులను 0.5% నుండి 1.5% పోటాషియం మేటబైసల్ఫేట్ లేదా 600 మి.గ్రా. సాధారణ ఉప్పు లీటరు నీటిలో కరిగించగా ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి వైర్మేష్ మీద అరబెట్టడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. నిల్వ ఉంచినప్పుడు సిలికాజెల్ ఒక చిన్న ప్యాక్‌ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి.
లాభాలు ఇలా..
మార్కెట్లో పుట్టగొడుగుల విత్తనాల ధర కిలో రూ.75 గా ఉన్నది. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తక్కువ ధరకు విత్తనాలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. కిలో పుట్టగొడుగులు రూ.25 – 30 ఖర్చులో పండించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగుల ధర కిలోకు దాదాపు 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. వీటి పెంపకం నుంచి దాదాపు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభాలను పొందవచ్చు.agriculture news, telugu news, Mushroom farming, Management techniques
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

