Papaya cultivation | బొప్పాయి సాగులో యాజమాన్య పద్ధతులు
Papaya cultivation | సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు. 9 నెలల నుంచి రెండేండ్ల వరకు కాపునిచ్చే ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది.
Papaya cultivation | బొప్పాయి.. పోషక విలువులు కలిగిన పండ్ల జాతిలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ పండ్లలో ఏ, సీ విటమిన్‌తోపాటు ఐరన్, కాల్షియం, భాస్వరం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. బొప్పాయిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. బొప్పాయిని కేవలం పండుగానే కాకుండా వీటిని నుంచి పాలను సేకరించి పపెయిన్ అనే ఎంజైమ్‌ను తయారు చేస్తారు. మందుల తయారీలో ఈ ఎంజైమ్‌ను వినియోగిస్తారు.
సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు. 9 నెలల నుంచి రెండేండ్ల వరకు కాపునిచ్చే ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది. సాగు సమయంలో వైరస్, బ్యాక్టీరియా తెగుళ్ళ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటను కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడిని, లాభాలను పొందవచ్చు.
తెగుళ్లు
కాండం కుళ్ళు తెగులు : వానాకాలంలో ఈ తెగులు అధికంగా ఉంటుంది. నీరు ఎక్కువగా నిలువ ఉండటం వల్ల కాండం కుళ్ళిపోతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. దీని నివారణకు మొక్క మొదలు వద్ద నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి బొప్పాయి మొక్కల మొదళ్లలో పోయాలి.
ఈగ బెడద
కాయలు పక్వానికి వచ్చే దశలో ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు మిథైల్ యుజినల్ ఎర బుట్టలను ఉపయోగించి ఈగలను ఆకర్షించేలా చేయాలి. ఈ బుట్టల్లో చిక్కిన ఈగలను నాశనం చేయాలి. తోటను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగల సమస్య రాకుండా చూసుకోవచ్చు.
రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఆశించడంతో పంట నాణ్యతతోపాటు దిగుబడి కూడా తగ్గిపోతుంది.
రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే ప్రొఫెనోపాస్ లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి. రెండో దశలో ఇమిడా క్లోప్రేడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరుకు కలిపి పిచికారి చేయాలి.
పిండినల్లి
కాయల నుంచి రసం పీల్చటం వల్ల కాయలు రంగు మారిపోతాయి. పిండినల్లి తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్.. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఇక నులి పురుగుల నివారణకు 250 గ్రాముల వేప పిండి, కర్బోఫ్యురాన్ 3జీ గుళికలు, సుదోమొనాస్ ఫొరిసెన్స్ 4గ్రాముల చొపున ఒక్కో మొక్కకు వేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగులను ఆకర్శించి నాశనం చేయవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

