Bottle Gourd | ఆనిగెపు కాయ సాగులో మెలకువలు..
Bottle Gourd | సొరకాయ పందిరి సాయంతో పెరుగుతుంది. వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా కాకుండా ఇంటి పెరట్లో కూడా సులువుగా పండించు కోవచ్చు. క్రమ పద్ధతిగా ఆచరించినట్లయితే సొరకాయ సాగులో ఉత్తమమైన దిగుబడులను...
Bottle Gourd | సొరకాయ.. ఆనెపు కాయ.. ఆనిగెపు కాయ.. ఆనప కాయ.. ఆనగ కాయ.. ఇలా ఎన్నో రకాలుగా పిలుచుకునే బాటిల్ గార్డ్.. ఎన్నో ఏండ్లుగా మన వద్ద లభ్యమవుతున్నది. మానవజాతికి పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీతోపాటు సోడియం, ఐరన్, జింక్ లభిస్తుంది. వీటిలో ఉండే నీరు మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. మలబద్థకం, కాలేయ సమస్యతో బాధపడుతున్నవారు సొరకాయ తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని వైద్యులు సెలవిస్తున్నారు.
సొరకాయ పందిరి సాయంతో పెరుగుతుంది. వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా కాకుండా ఇంటి పెరట్లో కూడా సులువుగా పండించు కోవచ్చు. క్రమ పద్ధతిగా ఆచరించినట్లయితే సొరకాయ సాగులో ఉత్తమమైన దిగుబడులను పొందవచ్చు. సొరకాయలో అధిక లాభాలు పొందాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలో తెల్సుకుందాం.
అనువైన నేలలు
ఇసుక లోమీ నేలలు, ఎర్ర నేలలు, బంకమట్టి నేలల్లో సొరకాయ సాగును చేపట్టడం సులువుగా ఉంటుంది. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. పొలంలో మురుగు నీటిని సులువుగా ప్రాలదోలే చర్యలు చేపట్టాలి. ఉదజని సూచిక (pH) 6.5 నుంచి 7.5 వరకు వున్నవి మాత్రమే అనువైనవి.
వాతావరణం
సొరకాయ సాగుకు మితమైన వెచ్చని ఉష్ణోగ్రత అవసరం. 26-28 డిగ్రీల సెల్సియస్ దగ్గర మంచి దిగుబడి లభిస్తుంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఉండాలి.
అధిక దిగుబడినిచ్చే రకాలు
పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్, కో 1, పూసా మంజరి, పూస మేఘదూత్ వంటి రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి.
విత్తన మోతాదు
ఒక ఎకరానికి 1 నుంచి 1.5 కిలోల విత్తనాలు విత్తుకోవాలి.
విత్తన శుద్ధి
విత్తడానికి ముందు ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు లేదా కార్బెండజిమ్ 2 గ్రాములు ఒక కిలో విత్తనాలతో కలిపి శుద్ధి చేసుకోవాలి. ఫలితంగా విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు. అలాగే, మొలకెత్తడంలో అడ్డంకులు తొలగేలా చూసుకోవచ్చు.
నీటి పారుదల
విత్తనాలు విత్తక ముందు నీటిని పారించి తగిన తేమ ఉండేట్లుగా చూసుకోవాలి. సొరకాయకు పూత, పిందె వచ్చే సమయం చాలా సున్నితమైంది. అందుకని ఈ సమయంలో నీటి పారుదల బాగా ఉండేట్లు చూసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
సేంద్రీయ ఎరువులను వాడటానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎకరా సొరకాయ సాగుకు దాదాపు 40 కిలోల నత్రజని ,30 కిలోల భాస్వరం, 25కిలోల పోటాష్ ఎరువులు అవసరమవుతాయి. నత్రజని ఎరువును మొత్తం ఒకేసారి వేయకుండా రెండు భాగాలుగా విభజించి వేసుకోవడం ఉత్తమం. మొదటి మోతాదును విత్తిన తర్వాత 3-4 వారాల మధ్య.. రెండో మోతాదును పిందె దశలో ఉన్నప్పుడు వేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.
కలుపు నివారణ
కలుపు మొక్కలను నివారణకై బ్యుటాక్లొర్ లేదా అల్లాక్లొర్ ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మొక్కల మధ్య మళ్చింగ్ వేసి కూడా కలుపు రాకుండా నియంత్రించవచ్చు. దీనికై ఎండు గడ్డిని, ఆకులను లేదా ప్లాస్టిక్ షీట్ ఉపయోగించవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

