Blue tongue disease | గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి – నివారణ చర్యలు
Blue tongue disease | వానాకాలంలో గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి సోకి ఇబ్బందులు పెడుతుంది. వర్షాలకు ఈ వ్యాధి మరిని జీవాలకు వ్యాప్తి చెందుతుంది. తొలి దశలోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చు. అసలింతకీ నీలి నాలుక వ్యాధి అంటే..
Blue tongue disease | వ్యవసాయ అనుబంధంగా రైతులకు మూగ జీవాల పెంపకం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. వాటిలో గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే ఇతర మూగ జీవాల పెంపకానికి చేయాల్సిన ఖర్చుతో పోల్చుకుంటే గొర్రెల పెంపకానికి తక్కువ మొత్తంలోనే ఖర్చు అవుతుంది. అలాగే, నేలపై ఉన్న గడ్డీ, కలపు మొక్కలను మేస్తాయి. కాబట్టి వీటి మేత కోసం చేయాల్సిన ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. అయితే, వానాకాలంలో గొర్రెలకు పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వర్షకాలంలో గొర్రెలకు వచ్చే ప్రధాన వ్యాధులలో నీలి నాలుక వ్యాధి ఒకటి. వర్షాలు అధికంగా పడుతుతున్న సమయంలో ఈ వ్యాధి సంక్రమణ జరుగుతుంది. వైరస్ కారణంగా వచ్చే ఈ నీలి నాలుక వ్యాధి ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో అధికంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో గొర్రెల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యాధి లక్షణాలు
నీలి నాలుకు వ్యాధి సోకిన గొర్రెలకు ముఖం వాపుతో పాటు పుండ్లు ఏర్పడతాయి. అలాగే, గొర్రె మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక వాపుతో పాటు వీటిపై కూడా పుండ్లు ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. నోటి ద్వారా దుర్వాసన అధికంగా వస్తుంది. వ్యాధి మరింత ముదిరితే నాలుక నీలి రంగులోకి మారుతుంది. ఈ సమయంలో మేత సరిగ్గా తినలేవు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు చనిపోయే ప్రమాదమూ ఎక్కువే.
నివారణ చర్యలు
గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలను నివారణ చర్యలు తీసుకోవాలి. గొర్రెల షెడ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాధి సోకితే యాంటి బయాటిక్ మందులు వాడాలి. మేతను మేయలేవు కాబట్టి మరణమప్పును తగ్గించడానికి అంబలితో పాటు రాగి గంజిని అందించాలి. పుండ్లు ఏర్పడిన ప్రాంతంలో ఒక శాతంతో ఉన్న పోటాషియం పర్మాంగనేట్‌ను పుండ్లపై రుద్దలి. ఇతర మందులు కూడా వాడుకోవచ్చు. వ్యాధి సోకిన గొర్రెలను వేరుగా ఉంచడం వల్ల మిగతా వాటికి ఇది వ్యాపించకుండా ఉంటుంది.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

