హైదరాబాద్: ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్‌తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప్ట్ ప్రాథమిక ఉద్దేశం. చాలాకాలంగా భారతదేశంలోని ఇంటర్నెట్ మార్కెటింగ్ సేవలలో అగ్రగామిగా కొనసాగుతున్న ఐడియాటిక్ మీడియా ఇలాంటి వాటిలో కచ్చితంగా విజయం సాధిస్తుంది.
భాషాపరమైన ఇబ్బందుల కారణంగా మీమ్ ప్రకటనల డిమాండ్‌కు, పరిశ్రమ చూపించే ఆసక్తికి మధ్య అంతరం ఏర్పడింది. మీమ్ మార్కెటింట్ సేవలను దేశమంతటికీ విస్తరించడం కోసం ఈ అంతరాన్ని తగ్గించడం, కేంద్రీకృత సేవలను అమలుచేయడం చాలా అవసరం. ఈ మీమ్ మార్కెటింగ్ గొప్ప ప్రారంభం. ఎందుకంటే ఐడియాటిక్ మీడియా కారణంగా మీరు మీ సొంత భాషలో మీమ్లను ఆస్వాదించవచ్చు. మీరు అనువదించాలనే చింత లేకుండా ఎవరికైనా జోకులు చెప్పవచ్చు. ఐడియాటిక్ మీడియావల్ల ఇకపై మీమ్స్ అసహ్యంగా, అర్థం లేకుండా ఉండవు.
అర్బన్ కంపెనీ
ఈ క్యాంపెయిన్ మల్టిపుల్ మీమ్ పోర్టల్లలో కనిపించింది. అదేవిధంగా 3.6 మిలియన్లకంటే ఎక్కువ వ్యూస్‌ను సాధించింది. అర్బన్ కంపెనీ క్లీనింగ్ కేటగిరీకి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రకటనలు ఎక్కువగా వచ్చాయి.
హలో
ఈ యాప్ ఉనికి గురించి సోషల్ మీడియా ద్వారా విన్న విషయాన్ని గుర్తుతెచ్చుకుందాం. అయితే ఐడియాటిక్ మీడియా ఈ యాప్‌తో కలసి ఏదో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చిన ఎంగేజ్మెంట్స్ రేట్స్ దాదాపు 3.5 మిలియన్లు. అందుకే ఈ క్యాంపెయిన్ చాలా కాలంపాటు మల్టిపుల్ లాంగ్వేజస్‌లో సాగింది.