కుంటాల, డిసెంబర్ 3 : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లను శనివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. కల్లూర్, అర్లి ఎక్స్ రోడ్డు సమీపంలో అక్రమంగా వెలసిన వెంచర్లను అధికారులు పరిశీలించి హద్దు రాళ్లను తొలగించారు. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఖలీం హెచ్చరించారు. ఆర్ఐ విజయ్, సిబ్బంది ఉన్నారు.
భైంసా, డిసెంబర్, 3 : మండలంలోని ఖత్గాం శివారులో వేదం తపోవన్ పాఠవాల పక్కన వెలసిన వెంచర్లను అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో తమకు కాపీ చూపించాలని అధికారులను కోరారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అరవింద్, ఫయజుల్లాఖాన్, సంతోష్, రాజు, మాజీద్, జేకే పటేల్, సాజీద్, తదితరులు ఉన్నారు.