దిలావర్పూర్ ఆగస్టు 10: ఆటాపాట ఒత్తిడి లేని పూర్వ ప్రాథమిక విద్య.. చక్కని పౌష్టికాహారంతో పాటు ఆధునిక వసతుల తో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యతో పాటు చక్కని సంస్కారం అందిస్తున్నాయి అంగన్వాడీ కేంద్రాలు. దిలావర్పూ ర్ మండలంలోని 13 పంచాయతీల్లో అంగన్వాడీ కేంద్రాలను మోడల్‌గా తయారు చేసి చిన్నారులైన విద్యార్థులకు కావల్సిన ఆట వస్తువులను తెచ్చిపెట్టారు.
ప్రస్తుత ఏ కార్పొరేట్ పాఠశాలల్లో చూసినా మా ర్కులే ప్రామాణికంగా చిన్నారులకు బట్టి విద్యను కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇంటిపని, మార్కులు, ర్యాంకులే చదువు అన్నట్లుగా మారిపోయింది. ఇందుకు భిన్నంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల కు ఒత్తిడి లేని చదువు ఉంటుంది. నేడు పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా తంగేడుపువ్వు, పాలపిట్ట లాంటి పేర్లతో కలిగిన అభ్యసన దీపికల ద్వా రా చిన్నారులకు బోధన జరుగుతున్నది. వీటి ఆ ధారంగా చిన్నారుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందించే ప్రయత్నం చేస్తారు. ఆటాపాటలు,కథలతో క్రమంగా అక్షరాభ్యాసం దిశగా వారిని అడుగులు వేయిస్తారు.
చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించడమే కా కుండా యూకేజీ వరకు పూర్వ ప్రాథమిక విద్య అందించి బడికి సంసిద్ధులను చేస్తారు. నిపుణులు సూచించిన ఆట వస్తువులు వినియోగంతో చిన్నారుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపడంతో పాటు వారిని శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు కృ షి చేస్తారు. కేంద్రాలకు ప్రభుత్వం అందించిన క థల పుస్తకాలను చదివి వినిపించడం, ఆట వస్తువులతో ఆడించడం చేస్తాస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతి రోజు ఉదయం గుడ్డు, మధ్యాహ్నం భోజనం, సా యంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలకు పౌష్టికాహారం అందించలేక పోతున్న తల్లిదండ్రులెందరికో దీని వలన ప్రయోజనం చేకూరుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు వ చ్చే పిల్లలకు సన్నబియ్యంతో చేసిన అ న్నం అందిస్తున్నా రు. వీటన్నింటితో పాటు చక్కని నాణ్యమైన విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం రాష్ట్ర సర్కారు అందిస్తున్నది.
మొత్తం గ్రామ పంచాయతీలు:13
మొత్తం అంగన్వాడీ కేంద్రాలు: 28
మిని అంగన్వాడీ కేంద్రాలు: 3
మొత్తం చిన్నారులు:1958
అంగన్వాడీ కేంద్రాల కు ప్రభుత్వం కల్పిస్తున్న మంచి సౌకర్యాలు ఉండడంతో తల్లిదండ్రులు సైతం ఉత్సహంగా చిన్నారులైన విద్యార్థులను పంపిస్తున్నారు. వీరికి పౌష్టికాహారంతో పాటు ఆటా పాటలతో కూడి న విద్యను అందిస్తున్నాం. గర్భి ణులు, బాలింతలకు కూడా పౌష్టికాహారం తీసుకునేందుకు ఉత్సహంగా వస్తున్నారు.
-ప్రసూనా కుమారి, సూపర్వైజర్ దిలావర్పూర్