కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సిలిండర్ కోసం ఆధార్ కార్డు కేవైసీ ఇచ్చేందుకు జనం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట భారీ సంఖ్యలో బారులు దీరుతున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండేన్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు చాలా మంది రావడంతో నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి మరుసటి రోజు రమ్మంటున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ)