Home
Adilabad
Many Speakers Praised Acharya Jayashankar Sir Who Played A Vital Role In The Achievement Of Telangana State
సార్.. చిరస్మరణీయుడు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ సార్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు కొనియాడారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- రాష్ట్ర సాధనకు కృషి మరువలేనిది
- జయశంకర్ సార్ వర్ధంతి వేడుకల్లో వక్తలు
- విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు.. అన్నచోట్లా ఘన నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ సార్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు కొనియాడారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లు, కార్యాలయాలు, పాఠశాలల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు సార్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని మేధావులు, యువకులు, విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారని, ఉద్యమానికి ఊపిరి అయ్యారని కొనియాడారు.
-మందమర్రి/జన్నారం/కోటపల్లి/కాగజ్‌నగర్/కాసిపేట/దండేపల్లి/సీసీసీ నస్పూర్/రామకృష్ణాపూర్, జూన్ 21
- మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తా వద్ద ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్ర పటానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జే రవీందర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు బడికెల సంపత్, బండారి సూరిబాబు, ఎండీ అబ్బాస్, ఓ రాజశేఖర్, మద్ది శంకర్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, పల్లె నర్సింగ్, బెల్లం అశోక్, అందె శ్రీకాంత్, కనకం రవీందర్, సోషల్ మీడియా ఇన్చార్జి సీపెల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
- జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి విశ్వబ్రాహ్మ ణ సంఘం అధ్యక్షుడు కడర్ల నర్సయ్య ఆధ్వర్యంలో పూల మాలు వేసి, నివాళులర్పించారు. బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్, శ్రీధర్ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- కోటపల్లి మండలం బావనపల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం బొలిశెట్టి బుచ్చన్న ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను వివరించారు. జయశంకర్ చిత్రపటానికి హెచ్ఎం, విద్యార్థులు పూలమాల వేసి, నివాళులర్పించారు.
- కాగజ్‌నగర్ పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజ న్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయ ణ, అసోసియేషన్ ప్రతినిధులు నారాయణ, ఏట్లాగౌ డ్, రమణయ్య, నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
- కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో జయశంకర్ సార్ చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, మద్దినేని చిన్న భీమయ్య, అంబేదర్ యువజన సంఘం మండల నాయకుడు దాసరి రాజన్న పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
- దండేపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, సభ్యులు వెంకటేశ్, కిషన్, సత్తన్న, గంగాధర్, నాగన్న, శ్రీధర్, గంగారాం, శ్రీకాంతాచారి తదితరులు పాల్గొన్నారు.
- సీసీసీ నస్పూర్‌లోని నస్పూర్‌కాలనీలో గల టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి పెట్టం లక్ష్మణ్, నాయకులు పొగాకు రమేశ్, పానుగంటి సత్తయ్య, బండి రమేశ్ వెంకట్‌రెడ్డి, రాజునాయక్, తిరుపతిరెడ్డి, సంతోష్‌రెడ్డి, సల్మాన్, హరీష్ తదితరులు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
- రామకృష్ణాపూర్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విఠల్‌నగర్ చౌరస్తాలో గల జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్, సీనియర్ నాయకుడు రామిడి కుమార్, కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, పార్వతి విజయ, నాయకులు ఎల్లబెల్లి మూర్తి, భూమయ్య, గడ్డం రాజు, పిల్లి సతీశ్, గాజుల చంద్రకిరణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

