మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 11 : ఆదర్శప్రాయుడు ముత్తినేని అర్జున్‌రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల తొలి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అర్జున్‌రావు ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మహేశ్వరి మెడికల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులకు అర్జున్‌రావు ఆదర్శంగా నిలుస్తారని, ముక్కుసూటితనం, నిఖార్సయిన వ్యక్తిగా, మున్సిపల్ చైర్మన్‌గా ప్రజలకు ఎన్నో సేవలందించారని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, బీసీ నాయకునిగా ఎదిగి, రాజకీయ చైతన్యంతో పదవులను అలంకరించారని, హమాలీ సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారని గుర్తు చేశారు.
ఆయన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వసుంధర, అర్జున్‌రావు కూతుళ్లు అత్తి సరోజ, హేమలత, కుమారులు రాంమోహన్‌రావు, రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రేస్ నాయకులు పాల్గొన్నారు.