Jainur | జైనూర్‌లో జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా
జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు జాబ్ మేళా నిర్వహించారు.
జైనూర్, జూన్ 09 : జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా జై నూర్ సిర్పూర్ (యు) లింగాపూర్ మూడు మండలాల నిరుద్యోగ యువతీ యువకులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మూడు నెలలు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి చేరాలన్నారు. గ్రామాల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆరు కోర్సులలో శిక్షణ తీసుకొని మీకు నచ్చిన కోర్సులో పూర్తి చేసినట్లయితే వెంటనే జీఎంఆర్ సంస్థ తరఫునుంచి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తాసిల్దార్ ఆడబీర్షా, సీఐ రమేష్, జీఎంఆర్ మొబలైసింగ్ మేనేజర్ పిజె మనోహర్, రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

