సంక్షేమానికి రంగానికి మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల అధికారుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులకు వచ్చే నెల 6 నుంచి 27వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్‌తో
- నిరుద్యోగులకు సదావకాశం
- ఉమ్మడి జిల్లాలో 51 ఉద్యోగాల భర్తీకి అవకాశం
- జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిర్మల్ టౌన్, డిసెంబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల అధికారుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులకు వచ్చే నెల 6 నుంచి 27వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హామీనిచ్చిన నేపథ్యంలో వరుస నోటిఫికేషన్లు వస్తుండడంతో నిరుద్యోగులు ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకుంటున్నారు.
కొలువు కొట్టాలనే లక్ష్యంతో కష్టపడి చదువుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను సైతం విడుదల చేయడంతో ఒక్క పోస్టు కాకపోతే మరో పోస్టు దక్కుతుందన్న ఆశతో నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాల్లో చదువుతూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న హాస్టళ్లలో హాస్టల్ వార్డెన్ పోస్టులు భారీగానే ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బీసీ సంక్షేమశాఖలో 62 పోస్టులకుగాను 49 మందే పని చేస్తున్నారు. 13 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.ఎస్సీ సంక్షేమశాఖలో 73 పోస్టులకుగాను 47 మంది పని చేస్తున్నారు.
26 ఖాళీలు, ఎస్టీలో 56 పోస్టులకుగాను 44 పోస్టులు భర్తీ కాగా..12 ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎస్సీ బీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు సంక్షేమ హాస్టళ్ల వార్డెన్ పోస్టులకు అర్హులుగా పేర్కొనడంతో నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది జోనల్‌స్థాయి పోస్టు కావడంతో గ్రేడ్-1, గ్రేడ్ 2 పోస్టులు కావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులు భర్తీ అయితే విద్యార్థులకు మరింత ప్రయోజనం దక్కనున్న నేపథ్యంలో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుల భర్తీతో ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వివిధ సంక్షేమ అధికారుల వార్డెన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం సంతోషంగా ఉంది. 2020లోనే ఉమ్మడి జిల్లాలో చాలా మంది హాస్టల్ వార్డెన్లుగా కొత్తవారు ఎంపికై సేవలను అందిస్తున్నారు. రెండేళ్లలోనే తిరిగి నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగ అభ్యర్థులకు హాస్టల్ వార్డెన్ పోస్టులు దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ హాస్టల్ వార్డెన్, నిర్మల్
ఉద్యోగం సాధిస్తా
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నది. ప్రభుత్వ గురుకులల్లో కూడా ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసిన నేను కొన్నేళ్లుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువు చెబుతూ ఉపాధి పొందుతున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి హామీనిచ్చి, ఆరు నెలల నుంచి ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఉంది.
– దుంపాల రమేశ్, ఎంఎస్సీ, బీఈడీ
కష్టపడి చదువుతున్నాం..
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఉన్నత విద్యనభ్యసించి, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మాలాంటి వారికి ఒకేసారి అనేక శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఏదైనా ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో కష్టపడి చదువుతున్నాం. ప్రతిరోజు 15 గంటల దాకా చదువుతున్నాం. ఇటీవల సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తప్పకుండా దరఖాస్తు చేసుకుంటా.
– వేణుగోపాల్, నిరుద్యోగ అభ్యర్థి
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

