కుండపోత..
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది.
- ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో జోరువాన
- ఉప్పొంగిన వాగులు.. వంకలు
- నదులకు భారీగా పెరిగిన వరద
- తెగిపోయిన కల్వర్టులు.. రోడ్లు
- జలమయమైన కాలనీలు.. కూలిన ఇళ్లు
- ఎదుల్లబంధం వద్ద తెగిన రోడ్డు.. 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కోటపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్
నమస్తే నెట్ వర్క్, జూలై 19 : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. పలుచోట్ల కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగజ్‌నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ, మారుతీనగర్, ద్వారకానగర్, మసీదు ఏరియా, కాపువాడ ప్రాంతంలో ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు పడ్డారు. యువకులు పలు కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టారు. సర్‌సిల్క్ కాలనీలోని జడ్పీ సెకండరీ పాఠశాల (బాలికలు)లోని తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరగా, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.
సిర్పూర్(టీ) నుంచి చీలపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని కల్వర్టు వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో చీలపల్లి, మేడిపల్లి, లింబుగూడ, మాలిని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటుకలపాడు వాగు, డోర్పల్లి, లక్ష్మీపూర్ వాగులు ఉప్పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు సాగలేదు. పెన్‌గంగ నది ప్రవాహం పెరుగుతున్నది. కౌటాల మండలంలో తాటిపల్లి వద్ద వార్దా నది నిండుకుండలా ప్రవహిస్తున్నది. చింతలమానేపల్లి మండలంలోని దిందా-కేతిని, బాబాసాగర్-నాయకపుగూడ గ్రామాల మధ్య ఉన్న వాగులు ఉప్పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడెం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత నిండుకుండలా ప్రవహిస్తున్నది. పెంచికల్పేట్ మండలంలోని పెద్దవాగు, ఉచ్చమల్లి వాగు, బొకివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండపల్లిలో ఊర చెరువు మత్తడి ఓవైపు కొట్టుకుపోయింది.
దహెగాం మండలం బీబ్రా, ఐనం, దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ తదితర గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి.. చిన్నరాస్పల్లి గ్రామానికి చెందిన రామగుండం సంజీవ్ ఇల్లు కూలింది. మంచిర్యాల జిల్లా నెన్నెలలో పిడుగుపడి ముద్ర కోళ సదయ్య ఇల్లు ప్రహరీ ధ్వంసమైంది. బెస్తవాడలోని ఇండ్లలోకి వరద రావడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. లంబాడీ తండా సమీంలోని ఎర్రవాగు ఉప్పొంగడంతో కాజ్వే పై ఉన్న సిమెంట్ స్లాబ్ కొంత కొట్టుకు పోయింది. కోటపల్లి మండలం ఎదుల్లబంధం గ్రామం సమీపంలోని తుంతుంగ చెరువు వద్ద రోడ్డు తెగిపోగా, ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, నందరాంపల్లి, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నక్కలపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న లో తొర్రెలోని లోలెవల్ వంతెన కొట్టుకుపోగా, నక్కలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు వేమనపల్లి మండలం బద్దంపల్లి, చామనపల్లి, బొమ్మెన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజారం నుంచి బబ్బెరచెలుక గ్రామాలకు వెళ్లేదారిలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మిస్తుండగా, పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. కోటపల్లి మండలకేంద్రంలో ఆకుల సమ్మక్క-చిరంజీవికి చెందిన ఇల్లు కూలిపోయింది. కోటపల్లి మండలంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటించి పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పురాణం సతీశ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మూల రాజిరెడ్డి, పోటు రాంరెడ్డి, మహేశ్‌ప్రసాద్, అజ్గర్ మోహియొద్దీన్, గుర్రం రాజన్న, గట్టు లక్ష్మణ్ గౌడ్, సీతరాంరెడ్డి ఉన్నారు.
చెన్నూర్ మండలం కత్తరశాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కెపల్లి సమీపంలోని కాజ్వే పై నుంచి వరద ప్రవహించడంతో అక్కెపల్లి, శివలింగాపూర్ గ్రామాలకు నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. భీమి ని మండలం ఖర్జీభీంపూర్ సమీపంలోని రహదారి కల్వర్టు తెగిపోగా, నాయబ్ తహసీల్దార్ అంజయ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మంచిర్యాల వద్ద రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. బైపాస్‌రోడ్డులో ఉన్న రంగంపేట కాజ్వే పైనుంచి వరద ప్రవహించింది. రంగంపేట, పాతమంచిర్యాల, శ్రీలక్ష్మీనగర్, సన్‌సిటీ, పవర్‌సిటీ, అండాళమ్మకాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

