కంటివెలుగుకు సన్నద్ధం
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
- ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ
- పకడ్బందీగా ఏర్పాట్లు
- జనవరి 18న ప్రారంభం
- నిర్మల్ జిల్లాలో 32 బృందాల ఏర్పాటు
- మొదటి విడుతలో పరీక్షలు చేసుకున్నవారు 3 లక్షల75 వేలు
నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. అందుకు మరో మారు ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018 ఆగస్టులో మొదటి విడుత కార్యక్రమం చేపట్టింది. అత్యంత అధునాతనమైన సాంకేతికత ఉన్న పరికరాల ద్వారా పరీక్షలు చేశారు. కంటి సమస్యలున్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు పంపణీ చేశారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేశారు. కాగా వచ్చేనెల జనవరి 18 నుంచి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం చేపట్టేందుకు సీఎం కేసీఆర్ శ్రీకా రం చుట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కంటివెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
సమస్యలున్నవారందరికీ పరీక్షలు..
జిల్లాలో 7,94,548 మంది జనాభా ఉండగా, జనాభాకు 12 శాతం పెంచి పరీక్షలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామాల్లో నిత్యం 300 మందికి పరీక్షలు చేస్తారు. పట్టణాల్లో 400 మందికి పరీక్షలు చేస్తారు. దగ్గరి చూపు ఉన్నవారికి వెంటనే అద్దాలు ఇస్తారు. దూరం చూపు ఉన్న వారికి ఆర్డర్ పెట్టి, అద్దాలు పంపిణీ చేస్తారు. ఆపరేషన్ అవసరం ఉన్న వారిని శస్త్ర చికిత్స కోసం ఎంపిక చేస్తారు. కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్షాసమావేశాలు నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో 32 బృందాలు..
కంటివెలుగు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్మల్ జిల్లాలో 32 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక అఫ్తాలమిక్ అధికారి, మెడికల్ అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సూపర్వైజర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ కార్యకర్తలు ఉంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కంటి సమస్యలున్నవారు పరీక్షలు చేయించుకోవాలి. కంటివెలుగు కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాం. జిల్లాలో 32 బృందాలు ఏర్పాటు చేశాం. దగ్గరి చూపు ఉన్నవారికి వెంటనే అద్దాలు పంపిణీ చేస్తాం. దూరపు చూపు ఉన్నవారికి సత్వరమే అద్దాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- eye test
- glasses
- State govt
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

