నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ఉట్నూర్ రూరల్ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మెట్‌పెల్లి సివిల్ జడ్జి జాదవ్ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం హస్నాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరం పరిసరాల ఖాళీ స్థలంలో ఉన్న పనికిరాని మొక్కలను శ్రమదానంతో తొలగించారు. అనంతరం జడ్జి ఆ స్థలంలో స్థానిక యువకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం అంతే ముఖ్యమని అన్నారు. యువత గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
గ్రామాలు పరిశుభ్రంగా పచ్చని చెట్లతో ఉంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జగన్, ఉప సర్పంచ్ అశోక్, యువకులు వసంత్‌రావు, సురేశ్, శంకర్, మానిక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

