గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో భాగంగా అందిస్తున్న శిక్షణలో ప్రతి అంశాన్నీ ఏకాగ్రతతో నేర్చుకుని పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సం బంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.
నస్పూర్, జూన్ 5 : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో భాగంగా అందిస్తున్న శిక్షణలో ప్రతి అంశాన్నీ ఏకాగ్రతతో నేర్చుకుని పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సం బంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, ప్రాంతీయ సమన్వయకర్త చక్రపాణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష చాలా ముఖ్యమైందని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
జూన్ 9న ఉదయం స్ట్రాంగ్ రూం నుంచి పరీక్షా కేంద్రాలకు కేటాయించిన రూట్ల ప్రకారం రూట్ అధికారులతో ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్, ఇతర సామగ్రి పోలీసు బందోబస్తు మధ్య తరలించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న సామగ్రిని, పత్రాలను ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణలో తెరవాలని తెలిపారు. అభ్యర్థులు బూట్లు, మొ బైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్ , వాచ్, నోట్, చాట్స్, జువెలరీ, ఇతర ఉపకరణాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించవద్దన్నారు. దివ్యాంగులకు నిబంధనల మేరకు 50 నిమిషాల అదనపు సమ యం ఇవ్వనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

