రోగైనా.. శవమైనా మా అంబులెన్స్‌లోనే..
మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్ల దౌర్జన్యం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సాక్షిగా ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు, ఓనర్లు కాసులకోసం కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులు.. క్షతగాత్రులు.. చివరికి మృతదేహమైనా..
- మృతదేహం ఉన్న
- వాహనాన్ని అడ్డుకొని వాగ్వాదం
- ‘నమస్తే’ను గమనించి పరుగులు
మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్ల దౌర్జన్యం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సాక్షిగా ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు, ఓనర్లు కాసులకోసం కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులు.. క్షతగాత్రులు.. చివరికి మృతదేహమైనా.. తమ అంబులెన్స్లలోనే తీసుకెళ్లాలని, లేదంటే డబ్బులు చెల్లించాల్సిందేనని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
దు:ఖంలో ఉన్నవారిపై మానవత్వం చూపించకుండా ముక్కుపిండి మరీ తమకు కావాల్సినంత వసూలు చేసుకుంటున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఘటనే ఇందుకు చక్కని ఉదాహరణ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నామనగర్కు చెందిన సాయికుమార్ సోమవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందగా, పోస్టుమార్టం కోసమని అక్కడి నుంచి అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. పోస్టుమార్ట పూర్తయిన తర్వాత తిరిగి అదే అంబులెన్స్‌లో తరలించేందుకు సిద్ధం కాగా, స్థానిక అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్లు అడ్డుకున్నారు.
మీకు తీసుకురావడమే తప్ప.. ఇక్కడి నుంచి ఏది వెళ్లాలన్నా తమ అంబులెన్స్లలోనేనని మృతుడి బంధువులు, అక్కడి అంబులెన్స్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇది గమనించిన కాగజ్‌నగర్ పోలీసులు జోక్యం చేసుకోవడం.. అదే సమయానికి ‘నమస్తే తెలంగాణ’ ఫొటోలు తీయడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనను చూసిన వారంతా.. ‘శవాన్ని తీసుకెళ్తుంటే ఇదేం రాద్దాంతమని, అసలు వీరు మనుషులేనా.. శవాలపై పైసలు ఏరుకుంటారా..’ అంటూ మండిపడ్డారు.
– మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

