బంధువొచ్చే వేళ..
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నది. సీజన్‌కు రూ.5 వేల చొప్పున యేడాదికి వానకాలం, యాసంగికి కలిపి రూ.10 వేలు జమ చేస్తున్నది. కొత్తగా మే 31 వరకు కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ చాన్స్ ఇవ్వనున్నది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 3,46,518 మంది రైతులు ఉండగా..రూ.704.69 కోట్లు పంపిణీ చేయనున్నారు
ఈ నెల 28 నుంచి రైతుబంధు
నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు
తొమ్మిదో విడుతకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
మే 31 వరకు దరఖాస్తు చేసుకున్న కొత్తవారికి కూడా సాయం
సాగు సమయంలో పైసలు చేతికొస్తుండడంతో కర్షకుల ఆనందం
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నది. సీజన్‌కు రూ.5 వేల చొప్పున యేడాదికి వానకాలం, యాసంగికి కలిపి రూ.10 వేలు జమ చేస్తున్నది. కొత్తగా మే 31 వరకు కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ చాన్స్ ఇవ్వనున్నది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 3,46,518 మంది రైతులు ఉండగా..రూ.704.69 కోట్లు పంపిణీ చేయనున్నారు. సాగు సమయంలో పెట్టుబడి చేతికొస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, కూలీకి డబ్బులు ఉపయోగపడుతాయని పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ప్రారంభమైంది. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్న మయ్యారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే తరుణంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా వానకాలం, యాసంగి పంటలకు సంబంధించి ప్రభుత్వం తొమ్మిదో విడుత రైతుబంధు సాయాన్ని అందిస్తున్నది. రూ.5వేల చొప్పున రెండు సీజన్లకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ యేడాది వానకాలం పంట పెట్టుబడి డబ్బులను ఈ నెల 28 నుంచి ఇవ్వనున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలిపి 3,27,353 మంది రైతులు రూ.503.49 కోట్లు పంపిణీ చేయనుంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.1,48,818 మంది రైతులకు రూ.277.26 కోట్లు, నిర్మల్ జిల్లాలో 1,78,535 మంది రైతులకు రూ.226.23 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 4.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 1,19,165 మంది రైతుల ఖాతాల్లో రూ.201.2 కోట్లు జమ కానున్నాయి.
కొత్త వారికీ అవకాశం ఇచ్చిన సర్కారు..
కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సర్కారు కల్పించింది. దీంతో కొత్తగా భూమి కొనుగోలు చేసి.. పట్టాదారు పుస్తకం, ఆఫీసు కాపీని మే 31వ తేదీలోపు రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు అందించారు. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వానకాలం పంటల కోసం రైతుబంధు సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తొలకరి జల్లులు కురియడంతో సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు, చేలల్లో దుక్కులు దున్నడం, తదితర వాటికి ఈ పెట్టుబడి సాయం ఎంతో అవసరమవుతుంది. రైతులకు ఎలాంటి రందిలేకుండా సకాలంలో సర్కారు రైతుబంధు అందిస్తున్నది.


Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Cultivation
- farming
- Monsoon
- Phase
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

