శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 02, 2020 , 00:19:03

నిష్పక్షపాతంగా ‘సహకార’ ఎన్నికలు

నిష్పక్షపాతంగా ‘సహకార’ ఎన్నికలు
  • కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌
  • హాజరైన జేసీ,ఇతర జిల్లా అధికారులు
  • ఎన్నికలపై అధికారులకు శిక్షణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో  ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా చట్టప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది అన్ని విషయాలపై పరిజ్ఞానం, అవగాహన కలిగిఉండాలనని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను చదివి యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించాలని అన్నారు. నామినేషన్‌ సమయంలో అన్ని అంశాలను పరిశీలించాలన్నారు. తిరస్కరించిన నామినేషన్ల వివరాలు సంపూర్ణంగా ఉండాలన్నారు. 


ఆధారాలతో కూడిన విచారణ చేపట్టాలని సూచించారు. ఉప సంహరణ అభ్యర్థి నుంచి రాత పూర్వకంగా స్వీకరించాలని అన్నారు. గుర్తులు కేటాయించడంలో నిబంధనలు పాటించి తెలుగు అక్షరమాల ప్రకారం బ్యాలెట్‌ పేపర్‌ తయారు చేసి నమూన బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల సంతకాలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 28 సహకార సంఘాలకు ఎన్నికలను ఈ నెల15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. సమావేశంలో జేసీ సంధ్యారాణి, జిల్లా సహకార సంఘం అధికారి మోహన్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పుల్లయ్య, ట్రైనర్‌ లక్ష్మణ్‌, ఎన్నికల నిర్వాహకులు పాల్గొన్నారు. 


logo