Apps:
Follow us on:

Supriya Yarlagadda | మామయ్య నాగార్జున హీరో కావడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచింది: సుప్రియ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

1/15Supriya Yarlagadda | ‘మామయ్య అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కంటే బెటర్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు లేరు.
2/15ఆయన ఎప్పుడో చేసినవి ఇప్పుడు చాలా మంది నిర్మాతలు చేస్తున్నారు. అందరూ కొత్తవాళ్లతో సీతారాముల కళ్యాణం, ఉయ్యాల జంపాల సినిమాలు నిర్మించారు.
3/15అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు ఎప్పుడో శ్రీకారం చుట్టింది’ అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda).
4/15స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) మనవరాలిగా, నాగార్జున (Akkineni Nagarjuna) మేనకోడలిగా అందరికి సుపరిచితురాలైన సుప్రియ (Supriya Yarlagadda),
5/15ఛాయ్‌బిస్కెట్ (Chai Bisket) నిర్మాణ సంస్థతో కలిసి కన్నడంలో విడుదలైన ఓ చిత్రాన్ని ‘బాయ్స్‌ హాస్టల్‌’ (Boys Hostel) పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
6/15ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
7/15ఆమె మాట్లాడుతూ ‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్‌ చూడగానే వినోదాత్మకంగా అనిపించింది.
8/15ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన దగ్గర వున్నారు. మంచి కంటెంట్‌ ఇస్తే చాలా గొప్పగా ఆదరిస్తున్నారు.
9/15ఈ సినిమాని రీమేక్‌ చేయడం కష్టం. ఒరిజినల్‌గానే ఎంజాయ్‌ చేస్తే ఈ సినిమా బాగుంటుంది. అందుకే తెలుగులో డబ్‌ చేశాం.
10/15మామయ్య హీరో కావడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ఇండస్ట్రీకి హబ్‌గా మారింది.
11/15ఇటీవల స్టూడియోకి వచ్చిన నాగార్జునకు పార్కింగ్‌ స్థలం దొరకలేదు. ఆయన తిడతారేమో అని భయపడ్డా.
12/15ఆయన చూసి ‘తాత వుంటే చాలా ఆనందపడే వారు కదా అన్నారు. దీనికి కారణం స్టూడియో ప్రారంభమైనప్పుడు తాత అమ్మమ్మ ఇక్కడ కూర్చుని..
13/15‘ఈ నెల కూడా ఎవరూ షూటింగ్‌కు రాలేదండి’ అని అమ్మమ్మ అనేవారు. ఇప్పుడి ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాత, నాగార్జున కృషి వుంది’ అన్నారు.
14/15Supriya Yarlagadda At Boys Hostel Movie Interview
15/15Supriya Yarlagadda At Boys Hostel Movie Interview