నా గతం తవ్వుతున్నాడు..
నా వయసు పందొమ్మిది. నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు నన్ను ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ ఆ విషయం నాకూ తెలియదు. అయితేనేం, సొంతబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు.
నా వయసు పందొమ్మిది. నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు నన్ను ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ ఆ విషయం నాకూ తెలియదు. అయితేనేం, సొంతబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఆ ఇంట్లో నాకు ఎలాంటి లోటూ లేదు. చాలా ఆప్యాయంగా ఉంటారు. నేను ప్రేమించే వ్యక్తికి ఆ విషయం తెలిసింది. నాకు చెప్పింది కూడా అతనే. నేను అమ్మానాన్నలను నిలదీశాను. వాళ్లూ నిజమేనని ఒప్పుకొన్నారు. పెంచిన తల్లిదండ్రులంటే నాకు ప్రేమ, గౌరవం. అతను మాత్రం నా నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. నా గతాన్ని ఆరా తీస్తున్నాడు. నేను అడిగినా అమ్మానాన్న నిజం చెప్పేస్తారు. కానీ నాకు ఆ ఆసక్తి లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి ఇదంతా తేలే వరకూ పెండ్లే వద్దంటున్నాడు. అలా అని, నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు?
– ఓ సోదరి
నిజంగానే నీదొక సంక్లిష్టమైన సమస్య. అయితే, ఆచితూచి వ్యవహరిస్తే.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నిజంగా అతను నిన్ను ప్రేమిస్తున్నాడా, నీ మూలాలను ప్రేమిస్తున్నాడా? ప్రేమ ఎప్పుడూ ప్రేమను మాత్రమే కోరుతుంది. అనుమానాలను, తప్పులను, నిజానిజాలను కాదు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా పెద్ద మనసు చేసుకుని క్షమించగలగాలి. అప్పుడే ఆ ప్రేమకు విలువ, అర్థం. నీ బాయ్‌ఫ్రెండ్ నీ నిజమైన తల్లిదండ్రుల గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు? నీ అసలైన కులం, గోత్రం, ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే నిన్ను నిన్నుగా స్వీకరిస్తాడా? ఆ తర్వాత గొడవలు వస్తే ఎవరిది బాధ్యత? కాబట్టి, తొందరపడాల్సిన పన్లేదు. ఇంకా నీ వయసు చిన్నదే. అతని స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే.. అడుగు ముందుకేస్తే క్షేమం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

