లాక్డౌన్లో చాలామంది కొత్త అడుగులు వేశారు. చెయ్యి తిరిగిన షెఫ్‌లు కొత్తకొత్త ఆలోచనలతో యూట్యూబ్ వీడియోలు చేశారు. సరిగ్గా అప్పుడే, ఢిల్లీకి చెందిన 31 ఏండ్ల మేఘా కోహ్లి తొలిసారిగా ఓ ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించింది. అందులో, పాత ఢిల్లీలో ఒకప్పుడు పేరుగాంచిన వంటకాలన్నీ పరిచయం చేసింది. వాటిని ఎలా వండాలో చెప్పింది. ఆహార చరిత్రనూ బోధించింది. అస్లాం చికెన్ ైస్టెల్లో బటర్ గ్రేవీతో చికెన్ కబాబ్, బేక్డ్ రాన్, షమీ కబాబ్స్, చికెన్ చంగేజీ, చికెన్ అచారీ బిర్యానీ, ఖమీరీ రోటీ మొదలైన పాత ఢిల్లీ ప్రత్యేక వంటకాలను ప్రపంచానికి చాటింది. “నాకు మొదటి నుంచీ మొఘల్స్ చరిత్రపై ఆసక్తి ఎక్కువ. పైగా నేను చదువుకున్నది కూడా చరిత్రే. అలా నాకు పాతకాలపు వంటలు, పాత ఢిల్లీలోని ప్రత్యేక రుచులంటే ఇష్టం మొదలైంది. చిన్నప్పుడు నాన్నతో కలిసి పాత బస్తీ వీధుల్లో తిరుగుతూ, రుచి చూసిన వంటలనే ఇప్పుడు జనానికి తెలియజెప్పాలని భావించాను. తరచూ వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను” అంటున్నది షెఫ్ మేఘా కోహ్లి.