క్రాక్ తర్వాత..కిర్రాక్ ఆఫర్లు
ఓ సినిమాలో న్యాయవాదిగా బలమైన వాదన వినిపిస్తుంది. ఆ తర్వాతి చిత్రంలోనే ప్రజాప్రతినిధిగా నాయకురాలు నాగమ్మను గుర్తుచేస్తుంది.
ఓ సినిమాలో న్యాయవాదిగా బలమైన వాదన వినిపిస్తుంది. ఆ తర్వాతి చిత్రంలోనే ప్రజాప్రతినిధిగా నాయకురాలు నాగమ్మను గుర్తుచేస్తుంది. ఇంకో సినిమాలో విలన్‌కు జోడీ గా కుట్రలకు కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ కనిపిస్తుంది. పవర్ఫుల్ లేడీ పాత్రకు పర్యాయపదంగా మారిపోయింది నటి వరలక్ష్మి శరత్‌కుమార్. తండ్రి నుంచి నటనను పుణికిపుచ్చుకున్న ఈ వారసురాలు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది.
తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. రచయితలు, దర్శకులు నా కోసం ప్రత్యేకమైన పాత్రలను సృష్టిస్తుండటం నిజంగా అదృష్టమే! ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్ర తర్వాత బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యశోద’ సినిమాలో మంచి క్యారెక్టర్లో
కనిపిస్తాను.
- ‘యశోద’ చాలా డిఫరెంట్ సినిమా. ప్రస్తుతం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న సరోగసి చుట్టూ అల్లిన కథ ఇది. నేను ‘సరోగసి ఫెసిలిటీ’ హెడ్‌గా కనిపిస్తా. ఈ పాత్రలో రెండు పార్శాలు ఉంటాయి. పాజిటివ్, నెగెటివ్ అని చెప్పలేను కానీ, కథలో కీలకమైన రోల్ పోషించా. కథలో భాగంగా కాలేజ్ స్టూడెంట్‌గానూ కనిపించాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. పదిహేను కిలోల బరువు కూడా తగ్గాను.
- చాలా దేశాల్లో సరోగసీకి చట్టబద్ధత ఉంది. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం తప్పా, ఒప్పా అనే చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. కానీ, పిల్లలు కనలేని వాళ్లకు మాతృత్వాన్ని ప్రసాదించే పరిజ్ఞానం ఇది. ‘యశోద’ సినిమాలో ఈ కోణాన్ని హృద్యంగా చూపించారు.
- ఈ సినిమాలో సమంతతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. దశాబ్ద కాలంగా ఆమె నాకు మంచి స్నేహితురాలు. సెట్స్‌లో బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.
- నేను చేసిన పాత్రల ఆధారంగా నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదేమో! మామూలుగా అయితే చాలా జోవియల్‌గా ఉంటాను. పని దగ్గరికి వచ్చేసరికి పక్కాగా ఉంటాను.
- సీరియస్ రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇమేజ్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా. బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’లో భానుమతి అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నా. జయమ్మ పాత్రలా ఇదీ గుర్తుండిపోతుందని నమ్ముతున్నా. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హను మ్యాన్’ సినిమాలో కథానాయకుడికి అక్క పాత్రలో కనిపిస్తున్నా. కొత్తగా కామెడీ ట్రై చేస్తున్నా. ఫైట్లూ చేశాను.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

