రెండు నుంచి ఐదేండ్ల లోపు పిల్లలకు ఏం కావాలి? ఆడుకోవడానికి బార్బీ బొమ్మలిస్తే చాలు. కానీ, ఆ బొమ్మలవల్ల వాళ్లు ఏం నేర్చుకుంటారు? దాదాపుగా సున్నా. ఆ ఆలోచనే కొడైకెనాల్‌కు చెందిన స్మృతి లామెచ్ను ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు నడిపింది. సావిత్రీబాయి పూలె, కల్పనా చావ్లా, మాయా ఏంజెలో, సరళా థక్రాల్ వంటి వీర వనితల గురించి పిల్లలకు తెలియజెప్పడానికి ఆటబొమ్మలను ఓ మాధ్యమంగా ఎంచుకున్నది స్మృతి. కొడైకెనాల్లో బొమ్మలను తయారుచేసే స్వయం సహాయక బృందాల సాయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కాన్సెప్ట్ నచ్చడంతో చాలామంది ఆర్డర్ చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా వచ్చే లాభాలను స్వయం సహాయక బృందాలకే ఇస్తున్నది స్మృతి.