Madhubala | బాలీవుడ్ నటి మధుబాల 1933 ఫిబ్రవరి 14న జన్మించింది. ప్రేమికుల రోజు పుట్టిన ఆమె ‘మొఘల్ ఎ ఆజమ్’ సినిమాలో అనార్కలి పాత్రలో విఫల ప్రేమికురాలిగా నటించింది. రియల్లైఫ్లోనూ అలాగే మిగిలిపోయింది. ‘ప్యార్ కియాతో డర్నా క్యా!’ పాటతో ప్రేమికులు తెగించాలని ఉపదేశించిన మధుబాల.. సలీమ్ పాత్ర ధరించిన దిలీప్ కుమార్ను ఇష్టపడింది.
కానీ, అతని ప్రేమను పొందలేకపోయింది. సినిమాలో సలీమ్, అనార్కలీ ప్రేమకు అక్బర్ అడ్డుపడ్డాడు. నిజ జీవితంలో వీరిద్దరి ప్రేమకు మధుబాల తండ్రి అడ్డుగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్న మధుబాల తనకు దిలీప్ దూరం కావడం తట్టుకోలేకపోయింది. 36 ఏండ్లకే 1969 ఫిబ్రవరి 23న కన్నుమూసింది.