హైడ్రోఫేషియల్ థెరపీ మంచిదేనా?
ఏ అమ్మాయి అయినా తన చర్మం సున్నితంగా, తేమగా మెరిసిపోవాలనే కోరుకుంటుంది. హైడ్రోఫేషియల్ థెరపీ ఆ కలను నిజం చేస్తుంది. క్లీనింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్, సీరమ్ డెలివరీ.. ఈ చికిత్సలో ప్రధాన దశలు. హైడ్రోఫేషియల్ థెరపీ చర్మం తొలి పొరలోని మృత కణాలను తొలగిస్తుంది. పేరుకుపోయిన జిడ్డును వదలగొడుతుంది.
మేడమ్ నమస్తే. మా కాలేజ్ క్యాంపస్‌లో చాలామంది అమ్మాయిలు హైడ్రోఫేషియల్ థెరపీ చేయించుకుంటున్నారు. ఇది మంచిదేనా? ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా?
– ఓ పాఠకురాలు
ఏ అమ్మాయి అయినా తన చర్మం సున్నితంగా, తేమగా మెరిసిపోవాలనే కోరుకుంటుంది. హైడ్రోఫేషియల్ థెరపీ ఆ కలను నిజం చేస్తుంది. క్లీనింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్, సీరమ్ డెలివరీ.. ఈ చికిత్సలో ప్రధాన దశలు. హైడ్రోఫేషియల్ థెరపీ చర్మం తొలి పొరలోని మృత కణాలను తొలగిస్తుంది. పేరుకుపోయిన జిడ్డును వదలగొడుతుంది. నూనె పదార్థాల ఉత్పత్తిని నియంత్రించి, కొలాజెన్ తయారీకి ఊతమిస్తుంది. దీంతో చర్మానికి కొత్తకాంతి సమకూరుతుంది. సీరం ప్రభావంతో హైపర్ పిగ్మెంటేషన్, ముడతలు మాయం అవుతాయి.
అక్కడక్కడా కాంతి హీనంగా ఉన్న చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. హైడ్రోఫేషియల్ రెండు నెలలకు ఒకసారి చేయించుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లకు రెండు రోజుల ముందు అయితే ఉత్తమం. ఇది సురక్షితమైన విధానం. కాకపోతే గర్భిణులు, సున్నితమైన చర్మం ఉన్నవారు, అలర్జీలతో ఇబ్బంది పడుతున్నవారు దూరంగా ఉండటమే మేలు. హైడ్రోఫేషియల్ థెరపీ ముప్పై నిమిషాల నుంచి నలభై అయిదు నిమిషాల ప్రక్రియ. చికిత్స ప్రభావం ఎంతకాలం ఉంటుందన్నది.. మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. హైడ్రోఫేషియల్తో.. చర్మం పొడిబారకుండా ఉంటుంది, చర్మంలోని వ్యర్థకణాలు తొలగిపోతాయి, గీతలు, ముడతలు మాయం అవుతాయి. నల్లమచ్చల బాధ ఉండదు. ఒత్తిడి నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
-డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

