కోలన్ క్యాన్సర్‌తో జాగ్రత్త
మన జీర్ణవ్యవస్థలో చివరలో ఉండే భాగాన్నే ‘కోలన్' అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్‌ను ‘కోలన్ క్యాన్సర్' అని అంటారు. ఆహారంలోని పోషక పదార్థాలను గ్రహించడం చిన్న పేగులు చేస్తే.. నీటిని, పొటాషియం సాల్టేట్లు, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి వేస్తుంది పెద్దపేగు.
మన జీర్ణవ్యవస్థలో చివరలో ఉండే భాగాన్నే ‘కోలన్’ అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్‌ను ‘కోలన్ క్యాన్సర్’ అని అంటారు. ఆహారంలోని పోషక పదార్థాలను గ్రహించడం చిన్న పేగులు చేస్తే.. నీటిని, పొటాషియం సాల్టేట్లు, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి వేస్తుంది పెద్దపేగు. దాదాపు చతురస్రాకారంలో ఉండే పెద్దపేగును నాలుగు భాగాలుగా విభజించారు. చివరిలో ఉండేదే.. మలద్వారం.పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణతులు) ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరగడమే ఈక్యాన్సర్కు కారణం. కొంతకాలం ఈ కణతులు ఏమీ చేయకుండా అలాగే ఉన్నా, క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కోలనోస్కోపిలో వీటిని గమనిస్తే, తీసివేయించుకోవడం మంచిది. మిగతా క్యాన్సర్లలాగే ఈ క్యాన్సర్ రావడానికి కూడా కచ్చితమైన కారణాలు తెలియవు. అయినా, జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్న
వారిలో, రెడ్ మీట్ (మాంసం) ఎక్కువగా తీసుకునే వారిలో, ఫైబర్ తక్కువగా తీసుకునే వారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్ నివారణ కోసం తీసుకునే రేడియేషన్ వంటివి కొంతవరకు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు అవ్వచ్చు. స్త్రీలలో, పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆపైబడిన వారిలో మరీ ఎక్కువ అవుతుంది.
కోలన్, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు:
ఈ లక్షణాలు కణతి ఎక్కడ వచ్చింది? దాని పరిమాణం ఎంత? ఏఏ భాగాలకు వ్యాపించింది? అన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా కనిపించే లక్షణాలు.. అజీర్తి లేక విరేచనాలు అవ్వడం, మలం, మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తం, రక్తపు చారికలు, పొట్ట కింద భాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండటం, గ్యాస్ ఉండటం, మలవిసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి, అకారణంగా నీరసం, బరువు తగ్గడం, ఇంటిబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐ.బీ.ఎస్.).
..ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే లివర్‌కు పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతూ ఉండటం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ, అకస్మాత్తుగా మన జీర్ణవ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా.. ఇంకా ఎక్కువ అవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.నివారణ : 50 ఏండ్లు పైబడినవారు ఒకసారి డాక్టర్ సలహా మేరకు మలపరీక్ష (ఎఫ్.ఒ.బి.టి.), సిగ్మాయిడోస్కోపి, కొలనోస్కోపి వంటి పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవర్చుకుంటే కొంత వరకు ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు.
మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యలు కూడా సాధారణమే. అయితే ఎప్పుడూ ఆ సమస్య అనే భావించకుండా ఒక్కసారి మలద్వారం, రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపి లేక వీటితోపాటు పెద్ద పేగును మొత్తంగా చూసే కొలనోస్కోపి, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగాని వేడిచేసిందనీ లేదా పైల్స్ వంటి సమస్యేమోలే అనీ ఎవరికి వారు సొంత వైద్యం చేసుకుంటే, ఉన్న సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది.
“పైల్స్ వంటి సమస్యలలో లేదా అజీర్తి, బ్యాక్టీరియా, వైరస్‌లతో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్ వలన కనిపించే లక్షణాలూ కోలన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాలు ఒకేలా ఉండవచ్చు. అందువలన పై లక్షణాలను అశ్రద్ధ చేయకుండా, డాక్టర్ గారి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం”
కోలన్ క్యాన్సర్‌కు వ్యాధి దశను బట్టి చికిత్స ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ ఉత్తమమైనది. ఈ రోజులలో ఈ సర్జరీలను లాప్రోస్కోపిక్ పద్ధతిలో (కీహోల్ సర్జరీ) నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో వ్యాధి సోకిన భాగాన్ని హైడెఫినిషన్ కెమెరా సాయంతో పరిశీలిస్తారు. ఈ కెమెరాలు వ్యాధి సోకిన భాగాన్ని పెద్దదిగా, స్పష్టంగా కనిపించేట్లు చేస్తాయి. ఫలితంగా సర్జరీని మరింత కచ్చితత్వంతో నిర్వహించవచ్చు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే, లాప్రోస్కోపిక్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, క్యాన్సర్ రకాన్ని బట్టి కిమోథెరపీ, రెడియోథెరపీ లేదా రెండిటినీ ఇవ్వాల్సి ఉంటుంది.క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా ఎడమవైపు కోలన్ క్యాన్సర్ఖు కీమో
థెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తరువాత సర్జరీ చేస్తారు.క్యాన్సర్‌ను చివరిదశలో గుర్తించినా, మోనొక్లోనల్ వంటి మందుల ద్వారా రోగి జీవిత కాలాన్ని పెంచవచ్చు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- colon cancer
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

