కడగకుంటేనే వెరీగుడ్డు
గుడ్లపై కోడిపెంట కనిపించడం మామూలు విషయమే! పౌల్ట్రీ ఫారం నుంచి కొనుగోలు చేసే కోడిగుడ్లు అపరిశుభ్రంగానే ఉంటాయి. దాంతో, చాలామంది కోడిగుడ్లను కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లను కడగకుండా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు.
గుడ్లపై కోడిపెంట కనిపించడం మామూలు విషయమే! పౌల్ట్రీ ఫారం నుంచి కొనుగోలు చేసే కోడిగుడ్లు అపరిశుభ్రంగానే ఉంటాయి. దాంతో, చాలామంది కోడిగుడ్లను కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లను కడగకుండా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు. కోడి గుడ్డు పెట్టినప్పుడు దానిపైన సహజంగానే ‘బ్లూమ్’ అని పిలిచే ఒక రక్షిత పొర ఏర్పడుతుంది. గుడ్డు లోపలికి బ్యాక్టీరియా వెళ్లకుండా ఈ పొర రక్షణగా నిలుస్తుంది. అయితే, కోడిగుడ్లను నీటితో శుభ్రంగా కడిగినప్పుడు మురికితోపాటు సూక్ష్మమైన ‘బ్లూమ్’ కూడా తొలగిపోతుంది.
దాంతో, గుడ్లలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఫలితంగా అవి త్వరగా పాడవ్వడంతోపాటు అనారోగ్యానికీ కారణం అవుతాయి. కాబట్టి, కోడిగుడ్లను నిల్వ చేయడానికి ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ కడగకూడదని నిపుణులు సూచన చేస్తున్నారు. ఒకవేళ మురికిగా కనిపిస్తే.. శుభ్రమైన తడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అయితే, వంట చేయడానికి ముందు కడిగితే ఫర్వాలేదట. కడిగిన తర్వాత వెంటనే వాడాలనీ, ఎక్కువసేపు నిల్వ చేయవద్దని అంటున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

