సద్గురువులే శరణ్యం
గురువు పట్ల ఆదరణ, అంకితభావం, గౌరవాన్ని తెలుపుతూ భక్తి శ్రద్ధలతో వేడుకను జరుపుకొనే రోజే ‘గురు పూర్ణిమ’. గురువు అనే పదంలో, ‘గు’ అంటే అజ్ఞానమని, ‘రు’ అంటే ఆ అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తి అని అర్థం. ఆ విధంగా ‘గురువు’ అంటే అత్యంత జ్ఞాన సంపన్నులు, జీవుని హృదయంలోని అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానం వైపు నడిపిస్తారని అర్థం.
- నేడు గురు పూర్ణిమ
గురువు పట్ల ఆదరణ, అంకితభావం, గౌరవాన్ని తెలుపుతూ భక్తి శ్రద్ధలతో వేడుకను జరుపుకొనే రోజే ‘గురు పూర్ణిమ’. గురువు అనే పదంలో, ‘గు’ అంటే అజ్ఞానమని, ‘రు’ అంటే ఆ అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తి అని అర్థం. ఆ విధంగా ‘గురువు’ అంటే అత్యంత జ్ఞాన సంపన్నులు, జీవుని హృదయంలోని అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానం వైపు నడిపిస్తారని అర్థం. ఆది గురువులైన కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఆషాఢ శుక్ల పూర్ణిమ తిథిన ఈ లోకంలో అవతరించినందు వల్ల, ఆ తిథి ‘గురు పూర్ణిమ’గా, ‘వ్యాస పూర్ణిమ’గా ప్రసిద్ధి గాంచింది. ప్రపంచవ్యాప్త హరే కృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులు గురు పూర్ణిమను గూర్చి ఇలా వివరించారు… ‘ఆధ్యాత్మిక గురువుకు గౌరవం ఇచ్చే ఈ విధానం అన్ని వైదిక సంప్రదాయాల్లో ఆచరణలో ఉన్నప్పటికీ, గౌడీయ సంప్రదాయంలో మాత్రం ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక గురువు పుట్టినరోజున వారికి సవినయంగా సన్మాన, వందన, భక్తిపూర్వక ఉపచారాలతో కృతజ్ఞతలను తెలియజేస్తాం. ఆ ప్రత్యేకమైన శుభ క్షణాన్ని వ్యాసపూజగా జరుపుకొంటాం.
గురువు ప్రాముఖ్యం
జీవితంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల ప్రాముఖ్యాన్ని రాబోయే తరాలకు వివరించడానికి గురు పూర్ణిమ ఎంతో అనువైనది. పూర్వం విద్యార్థులంతా గురువుగారి ఆశ్రమంలోనే ఉంటూ విద్యను అభ్యసించేవారు. గురువు కూడా ఉచితంగా బోధించేవారు. గురువుగారి ప్రతి మాట శిష్యులకు శిరోధార్యమై ఆజ్ఞగా స్వీకరించేవారని చరిత్రలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. గురువు ప్రసాదించిన విజ్ఞానం ఏకకాలంలో శిష్యునికి నిత్య జీవన విధానాన్ని తెలపడమే గాక, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల స్వచ్ఛమైన భక్తియుత సేవాభావాన్ని పెంపొందించి జీవిత పరమావధి వైపు నడిపిస్తుంది.
ఎవరు… ఎలాంటివారిని ఆశ్రయించాలి?
తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్
శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్
జీవిత పరమార్థాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలనే తపన ఉన్నవాడు గురు శరణం పొందాలి. (శ్రీమద్భాగవతం 11.2.21). అయితే, ఇక్కడ ‘మనం ఆశ్రయించదగిన ప్రామాణిక గురువును ఎలా కనుక్కోగలం?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికోసం గురువును ఆశ్రయించే ముందే ఓ చిన్న పరీక్ష చేయడం ఎంతో ముఖ్యం. అసమర్థులైన వారిని ఎప్పుడూ ఆశ్రయించకూడదు. దీని గురించి ముండకోపనిషత్తులో (1.2.12).. తద్-విజ్ఞానార్థం స గురుం ఏవాభిగచ్ఛేత్ శ్రోత్రియం బ్రహ్మ- నిష్ఠం అని వివరించారు. ఇందులో ముఖ్య పదం ‘శ్రోత్రియం’, అంటే ఒక ప్రామాణిక గురు-శిష్య పరంపరకు చెందినవారు అని అర్థం. గురువు లేకుండా తాను ఆత్మసాక్షాత్కారం పొందానని ఎవరైనా వాదిస్తే, అతను నకిలీ గురువే.
ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు.. పూజ్యశ్రీ ఎ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అలాంటి బ్రహ్మనిష్ఠ గల శిష్య పరంపరకు చెందినవారు. అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని నుంచి ఆరంభమై.. ఆ పరంపరలోని అనేక ఆధ్యాత్మిక గురువుల ద్వారా అందించబడిన విజ్ఞానం యథాతథంగా శ్రీల వ్యాసదేవ, శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరుల ద్వారా శ్రీల ప్రభుపాదుల వారిచే మనకు సంక్రమించింది. శ్రీల ప్రభుపాదుల లాంటివారే మనకు శరణ్యం. కాబట్టి, ఈ గురు పూర్ణిమ శుభ సందర్భంగా, ప్రతి ఒక్కరమూ మన గురువులను గౌరవిద్దాం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

