ఈ గింజల్లో పోషకాలు మెండు
ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు, జిమ్ వర్కవుట్లు మాత్రమే సరిపోవు. మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. చూడటానికి చాలా చిన్నవిగా కనిపించినా పోషకాల విషయంలో మాత్రం ఈ విత్తనాలు సూపర్ ఫుడ్స్ అనిపించుకున్నాయి.
ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు, జిమ్ వర్కవుట్లు మాత్రమే సరిపోవు. మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. చూడటానికి చాలా చిన్నవిగా కనిపించినా పోషకాల విషయంలో మాత్రం ఈ విత్తనాలు సూపర్ ఫుడ్స్ అనిపించుకున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒకటి-రెండు చెంచాలు తీసుకుంటే మీ శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరీ మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ గింజలేమిటో తెలుసుకుందాం…
హలీమ్ గింజలు: మన దేశంలోని మహిళల్లో అనేకమంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. వారి సమస్యకు హలీమ్ గింజలు అద్భుతమైన పరిషారం. వీటిలో ఐరన్, ఫోలెట్ పుషలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, అలసటను తగ్గిస్తాయి. హలీమ్ గింజలు రక్తహీనతతో బాధపడేవారికి సంజీవని లాంటివి. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్స్ ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలను చాలామంది కేవలం రుచి కోసమే తింటారు. కానీ, వీటిలో జింక్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్-ఇ మెండుగా ఉంటాయి. ఇవి పురుషులలో శుక్ర కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలోనూ, కండరాలకు శక్తినివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక.
అవిసె గింజలు: శాకాహారులకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే అత్యుత్తమ వనరు అవిసె గింజలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఎంతో మేలు చేస్తాయి. అయితే, అవిసె గింజలపై పొర చాలా గట్టిగా ఉంటుంది, అది త్వరగా జీర్ణం కాదు. అందుకే వీటిని పొడి చేసి తీసుకుంటేనే శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. ఈ మూడు రకాల గింజలను కలిపి రోజుకు ఒకటి నుంచి రెండు చెంచాలు స్మూతీస్, సలాడ్స్ లేదా పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

