Fashion | కాస్త చలిగా అనిపిస్తే చాలు.. జర్కిన్లు, స్వెట్టర్లు వేసుకుంటాం. ఇంట్లో వరకూ ఫర్వాలేదు కానీ, ఫంక్షన్‌కో పార్టీకో వాటిని వేసుకుని వెళ్లలేం. ఇప్పుడా భయం అక్కర్లేదు. డిజైనర్ డ్రెస్‌ల మీద కూడా కోటును పోలిన జాకెట్లు వస్తున్నాయి.
హాఫ్ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్‌స్కర్ట్ ఇది. స్కర్ట్కోసం వైట్ బేస్‌పై ట్రైబల్ ప్రింట్‌తో బార్డర్ ఇచ్చారు. వైట్ ఫ్యాబ్రిక్‌పై ఆల్ ఓవర్ బ్లాక్ డాట్స్తోపాటు బార్డర్లో చిన్న మస్టర్డ్ ఎల్లో లైన్పట్టీ ఇచ్చారు. యోక్పార్ట్కు బ్లాక్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో ప్లెయిన్ స్లీవ్‌లెస్ టాప్ ఇచ్చి, పైనుంచి జాకెట్ జతచేశారు. మస్టర్డ్ ఎల్లో ఇక్కత్ ఫ్యాబ్రిక్ జాకెట్ హైలైట్
అయ్యింది.
బ్లాక్ అండ్ వైట్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. వైట్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చేసిన వస్త్రంతో ఈ డ్రెస్ డిజైన్ చేశారు. ఒకేఫ్యాబ్రిక్తో పైనుంచి కిందివరకు స్లీవ్‌లెస్ లాంగ్ ఫ్రాక్ ఇచ్చి, యోక్పార్ట్ డివైడ్ చేశారు. వేవ్లుక్ కోసం బార్డర్‌కు పైపింగ్ ఇచ్చారు. ఫ్రాక్‌కు మ్యాచ్ అయ్యేలా వైట్ కలర్ లైనింగ్ జతచేశారు. బ్లాక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ జాకెట్‌ను ఎంచుకున్నారు. మగ్గం వర్క్‌తో వైట్ కలర్ ఫ్లవర్ బుటీస్, పఫ్ హ్యాండ్స్, ఓపెన్ నెక్ చక్కగా కుదిరాయి.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
“Mother of Pearl Jewellery | వజ్రాలను మరిపించేలా మెరిసే ఆల్చిప్ప ఆభరణాల గురించి తెలుసా !!”