మనసు మాట వినండి

‘ఆ అబ్బాయితో పెండ్లి ఇష్టమేనా తల్లీ’ – అమ్మానాన్న ప్రశ్న. ‘డేటింగ్ చేద్దామా?’ – ఓ స్నేహితుడి ప్రతిపాదన. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు, ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. జీవితాన్ని మలుపు తిప్పే కీలక ప్రశ్నలకు ‘అవును/సరే/
కాదు/లేదు’ అని ఠక్కున సమాధానం చెప్పేముందు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రేమ, పెండ్లి, రిలేషన్షిప్ వంటి విషయాల్లో ఆచితూచి అడుగేయకపోతే జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేసేముందు ‘మనం తీసుకున్న నిర్ణయం సరైనదేనా?’ అన్న ప్రశ్న సూటిగా మనసునే అడగాలి. ఇతరులను మెప్పించడానికి మాత్రమే అవునని చెబితే, ఆ నిర్ణయం సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే మన జీవితం మనకు నచ్చినట్లు ఉండాలి. ఇంకెవరికో నచ్చినట్టు కాదు. ఒత్తిడిలో ఎలాంటి పెద్ద నిర్ణయాలూ తీసుకోకూడదు. తక్షణం అవునని చెప్పాల్సిన పన్లేదు, కాదని చెప్పాల్సిన అవసరమూ లేదు. అలా అని ఎదుటి వ్యక్తి విధించే గడువుకు మనం తలొగ్గాల్సిన అగత్యమూ లేదు. మన జీవితం, మన నిర్ణయం!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- decision
- love
- Marriage
- Relationship
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

