పక్కపక్కన వద్దు
ఫ్రిజ్, ఓవెన్.. వంటింటి పరికరాలే! అయినా, వీటిని పక్కపక్కన ఉంచకూడదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సరిగ్గా నిర్వహించకుంటే.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఫ్రిజ్, ఓవెన్.. వంటింటి పరికరాలే! అయినా, వీటిని పక్కపక్కన ఉంచకూడదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సరిగ్గా నిర్వహించకుంటే.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
వంటగదిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్.. ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అందులోనూ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు అక్కడే ఉంటే.. అగ్నికి ఆజ్యం పోసినట్లే! వీటివల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు.
అలాకాకుండా ఉండాలంటే.. ఫ్రిజ్, ఓవెన్ లాంటివాటిని గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతంలో ఉంచాలని సూచిస్తున్నారు. ఇక ఫ్రిజ్ పక్కనే ఓవెన్‌ను పెట్టి వాడటం ఏమాత్రం మంచిదికాదు. మైక్రోవేవ్ వాడేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడితో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రిఫ్రిజిరేటర్ అసాధారణంగా వేడెక్కి.. పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఫ్రిజ్ పక్కన గ్యాస్‌స్టవ్ ఉంచినా.. ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ఫ్రిజ్ వెనుక భాగంలోని కంప్రెసర్కు గాలి సరిగ్గా తగిలేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య కనీసం 6 అంగుళాల దూరం ఉండాలి.
- కంప్రెసర్ కాయిల్స్, ఫ్రిజ్ వెనుక భాగాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే.. నిపుణుల దృష్టికి తీసుకెళ్లి, మరమ్మతు చేయించుకోవాలి.
- ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు ఉన్న ప్రాంతాల్లో స్టెబిలైజర్ ఉపయోగించడం బెటర్.
- ఇంట్లో పాత ఫ్రిజ్ వాడుతున్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. అలాంటివి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

