సమ్మర్ యాత్ర సేఫ్టీ మంత్ర
ఏ ట్రిప్ అయినా ముందస్తు ప్రణాళికతో ప్రారంభం కావాలి. వెళ్లే ప్రదేశం గురించి ముందుగా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రాంతంలోని వాతావరణం, స్థానిక పరిస్థితులు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకోవాలి.
వేసవి సెలవులు వచ్చాయంటే చాలామంది మహిళలు కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి కొత్త ప్రదేశాలుచూసేందుకు ప్రణాళికలు వేస్తుంటారు.యాత్ర మనసుకు సాంత్వన ఇచ్చే మంచి అనుభవం. అది మధురమైన అనుభూతుల్ని మిగల్చాలంటే భద్రతకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. అందుకోసం కొన్ని చిన్న విషయాలను ముందుగానే గుర్తుంచుకుంటే ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది. అలా మీ ట్రిప్‌ని టిప్ టాప్‌గా ముగించేందుకు ఇదిగోండి కొన్ని టిప్స్!
ఏ ట్రిప్ అయినా ముందస్తు ప్రణాళికతో ప్రారంభం కావాలి. వెళ్లే ప్రదేశం గురించి ముందుగా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రాంతంలోని వాతావరణం, స్థానిక పరిస్థితులు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకోవాలి. అలాగే బస చేసే హోటల్ లేదా హోమ్‌స్టే గురించి రివ్యూలు చదివి, విశ్వసనీయమైనదే ఎంపిక చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ప్రయాణ వివరాలు తెలియజేయడం కూడా ఒక భద్రతా చర్యగా ఉపయోగపడుతుంది.
డాక్యుమెంట్లు వెంటే
మహిళలు ట్రావెల్ సమయంలో అవసరమైన ముఖ్యమైన పత్రాలను తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. ఐడీ ప్రూఫ్, టికెట్లు, హోటల్ బుకింగ్ రిసీట్ తదితర డాక్యుమెంట్లను ఒక చిన్న ఫోల్డర్లో ఉంచుకోవడం మంచిది. ఈ డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీస్ కూడా క్లౌడ్ అకౌంట్లో భద్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జ్‌లో ఉండేలా చూసుకోవాలి. పవర్ బ్యాంక్, తాగునీటి బాటిల్, అవసరమైన మందులు వంటి వస్తువులు కూడా తీసుకెళ్లడం అవసరం. ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ ప్రయాణాన్ని సులభంగా మార్చగలవు.
టెక్నాలజీతో సేఫ్‌గా
ఇప్పటి కాలంలో మొబైల్ యాప్స్ మహిళల భద్రతకు సహాయపడుతున్నాయి. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం పంపే సేఫ్టీ యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రయాణ సమయం లో లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో షేర్ చేయడం కూడా మంచి అలవాటు. అలాగే అత్యవసర నంబర్లు సేవ్ చేసుకోవాలి. పోలీస్ హెల్ప్‌లైన్, 112 లాంటి ఎమర్జెన్సీ నంబర్లను ముందుగానే ఫోన్లో సేవ్ చేసుకోవడం మంచిది. ఇలా టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే ప్రమాదాలను కొంత నివారించవచ్చు.
జనంలో జాగ్రత్త
పర్యాటక ప్రదేశాల్లో లేదా ప్రజా రవాణాలో అపరిచితులతో ఎక్కువగా వ్యక్తిగత సమాచారం పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా తెలియని ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలి. ప్రయాణానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవాలి. ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లడం ఉత్తమం.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
వేసవిలో ప్రయాణం చేస్తుంటే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. ఎక్కువగా నీరు తాగాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సన్‌స్క్రీన్, టోపీ, గాగుల్స్ వంటి వస్తువులు సూర్యకిరణాల నుంచి రక్షణ కలిగిస్తాయి. ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది.
పిల్లలు భద్రం
చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ముందుగా పిల్లలకు తాగునీరు, తేలికపాటి ఆహారం, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలి. పిల్లలు జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తప్పిపోకుండా ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలకు తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఉన్న కార్డు లేదా బ్యాడ్జ్ పెట్టడం మంచిది. ఎక్కువ వేడి ఉన్న సమయంలో బయట ఎక్కువసేపు తిరగకుండా ఉండాలి. ప్రయాణానికి ముందు పిల్లలకు వెళ్లే ప్రదేశం గురించి చెప్పి జాగ్రత్తలు కూడా వివరించాలి.
యాప్ ఆసరా

- My Safetipin: ఈ యాప్ ప్రయాణికులకు ఒక ప్రాంతం ఎంత సురక్షితంగా ఉందో తెలియజేస్తుంది. వీధి లైటింగ్, జనసంచారం, భద్రత వంటి అంశాల ఆధారంగా ఆ ప్రాంతానికి ఒక స్కోర్ ఇస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లే మహిళలకు ఇది ఉపయోగకరం.
- Raksha Women Safety Alert: ఈ యాప్‌లో SOS బటన్ నొక్కితే కుటుంబ సభ్యులకు వెంటనే మెసేజ్‌తో పాటు లొకేషన్ పంపుతుంది. ఇంటర్నెట్ లేకపోయినా కొన్ని ఫీచర్లు పనిచేయడం దీని ప్రత్యేకత.
- 112 India App: ఇది భారత ప్రభుత్వ అత్యవసర సేవల యాప్. ప్రమాద సమయంలో SOS అలర్ట్ పంపితే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉపయోగించవచ్చు.
- bSafe App: ఈ యాప్‌లో లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలరు. ప్రయాణానికి ముందు ఈ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఉపయోగపడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

