OTT | ఓటీటీ హిట్ ..ఒక హత్య..ఎన్నో మలుపులు!
ప్రస్తుతం ఓటీటీలో నేర పరిశోధనాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతున్నది. అదేకోవలో వచ్చిన మరో ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘వదంతి’.
వదంతి (వెబ్‌సిరీస్)
అమెజాన్ ప్రైమ్: డిసెంబర్ 1
తారాగణం: యస్.జె.సూర్య, సంజన, లైలా, వివేక్ ప్రసన్న.
దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.
ప్రస్తుతం ఓటీటీలో నేర పరిశోధనాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతున్నది. అదేకోవలో వచ్చిన మరో ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ డ్రామా ‘వదంతి’. తమిళనాడు కన్యాకుమారి ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది. మమత అనే యువనటి సినిమా సెట్స్‌లో అనుమానాస్పదంగా మరణిస్తుంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చనిపోయింది మమత కాదని, పదిహేడేండ్ల ఆంగ్లో ఇండియన్ వెలోని (సంజన) అని పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ వివేక్ (యస్.జె.సూర్య) రంగంలోకి దిగుతాడు. కేసును శోధించే క్రమంలో అతనికి దిగ్భ్రాంతికర విషయాలు తెలుస్తాయి. కొత్త కొత్త అనుమానితులు బయటపడుతుంటారు.
‘వదంతి’ పరిశోధనాత్మక కథ మాత్రమే కాదు! ప్రస్తుత సమాజంలో టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా అనుసరిస్తున్న వైఖరులనూ చర్చిస్తుంది. నిజం గడపదాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే నానుడికి అద్దం పడుతుంది. ప్రేమకోసం తపించే ఓ అమాయకురాలైన అమ్మాయి సమాజం నుంచి ఎలాంటి భయంకర అనుభవాల్ని ఎదుర్కొంది అనేది హృదయాల్ని కదిలిస్తుంది. యస్.జె.సూర్య పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. హత్యకు గురైన అమ్మాయి తల్లి పాత్రలో లైలా కనిపించింది. సెబాస్టియన్ అనే రచయిత పాత్రలో నాజర్ నటించాడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Laila
- Nassar
- S. J. Suryah
- sanjana
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

