అప్పుడు చాలా బాధపడ్డా
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన మెరిసి, తన నటన, గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రంభ. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం నిరంతరం సోషల్‌మీడియాలో టచ్‌లో ఉంటున్నది.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన మెరిసి, తన నటన, గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రంభ. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం నిరంతరం సోషల్‌మీడియాలో టచ్‌లో ఉంటున్నది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ.. తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నది.
ముఖ్యంగా నటుడు జేడీ చక్రవర్తితో ఉన్న అనుబంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాను, జేడీ చక్రవర్తి కలిసి నటించిన ‘బొంబాయి ప్రియుడు’ సినిమా సమయం నుంచి తమ మధ్య ఎంతో బలమైన స్నేహం ఏర్పడిందని ఆమె గుర్తుచేసింది. జేడీ ఎప్పుడూ ఎంతో సరదాగా ఉంటాడని, ఆయన పకన ఉంటే సమయమే తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. అయితే, ఇంతటి గాఢమైన స్నేహం ఉన్నప్పటికీ, తన వివాహానికి ఆహ్వానించినా ఆయన రాకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది రంభ. ఆ సమయంలో ఆమె చాలా బాధపడిందట, తర్వాత జేడీకి ఫోన్ చేసి బాగా కోప్పడిందట కూడా! ఇక తన కెరీర్ ఎదుగుదల, పాత్రల ఎంపిక గురించి ప్రస్తావిస్తూ.. ‘సినీ ప్రయాణం ఆరంభంలో గ్లామర్ పాత్రలు ఎకువగా చేసినా, ఆ తర్వాత ప్రయోగాత్మక పాత్రలు చేసి నటిగా నిరూపించుకున్నా.
మేకర్స్ ఎకువగా గ్లామర్ పాత్రల కోసమే సంప్రదించేవార’ని పేర్కొంది రంభ. ఈ తరం హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ ఇద్దరి సరసన స్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తన మనసులోని మాట వెల్లడించింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని గుర్తుసింది. కాగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1990-2000 కాలంలో అగ్ర కథానాయికగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడకు చెందిన ఈమె ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెకించిన ‘ఆ ఒకటీ అడకు’ చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైంది. తరువాత వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనిపించుకుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

