మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కుమార్తె.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరు ఉన్నారంటే..
Femina Miss India | అందాల పండగొచ్చింది. ఈ సంవత్సరం కూడా ‘ఫెమినా’ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో మిస్ ఇండియా తొలిదశ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రజ్ఞ అయ్యగారి, ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి లిఖిత యలమంచిలి జాతీయ స్థాయికి వెళ్తున్నారు. సినీ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని తమిళనాడు ప్రతినిధిగా అర్హత సాధించడం విశేషం. మిస్ ఇండియా కిరీటం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 31 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఎవరో ఒకరు కిరీటం ధరిస్తారు. ఆ ఒక్కరే ప్రపంచ సుందరి పోటీలకు వెళ్తారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్. ‘ఫ్యాషన్ రంగం మీద మక్కువతో ఇక్కడి దాకా వచ్చాను. నా విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది’ అంటారామె. ఆంధ్రా సుందరి సాయి లిఖిత ఎంబీబీఎస్ చేశారు. అందాల ప్రపంచం మీద ఇష్టంతో ఫెమినా పోటీల్లో పాల్గొన్నారు. ‘నటిగా, వ్యక్తిగా నాకు ప్రియాంక చోప్రా స్ఫూర్తి. ఆమెది బలమైన వ్యక్తిత్వం’ అని చెబుతున్నారు లిఖిత. మెడిసిన్ చదువుతూనే సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శివాని ఓ సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. ఈ పోటీలో బహుమతి రూపంలో వచ్చే డబ్బును జంతు హింసకు వ్యతి రేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినియోగిస్తానని చెబుతున్నారు. ముగ్గురిలో ఏ ఒక్కరికి కిరీటం దక్కినా.. రెండు రాష్ట్రాలకూ సంబరమే.
Read More :
Shalini | మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టులో షాలినీ..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
Sai Pallavi Interview | విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సాయి పల్లవి
నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారు.. ఓపెన్ అయిన చాందిని చౌదరి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

