బైగాన్ బార్తా

కావలసిన పదార్థాలు
పెద్ద వంకాయ (ఎగ్ ప్లాంట్): ఒకటి, టమాట: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కరివేపాకు: ఒక రెబ్బ, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: అర టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా వంకాయను కడిగి నాలుగువైపులా గాట్లు పెట్టి మధ్యలో పచ్చిమిర్చి, వెల్లుల్లి పెట్టి నేరుగా సన్నని మంటపై మగ్గించాలి. పైన తొక్క బాగా కాలి లోపలంతా ఉడికిందనుకున్నాక, తీసి చల్లార్చుకోవాలి. చల్లారిన వంకాయ తొక్క తీసేసి లోపలి గుజ్జును పచ్చిమిర్చి, వెల్లుల్లితోపాటు బాగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక చిన్నగా తరిగిన టమాట ముక్కలు, ఉప్పు, కారం వేసి మగ్గించాలి. చివరగా ముద్ద చేసి పెట్టుకొన్న వంకాయ మిశ్రమం వేసి కలిపి, పైన కొత్తిమీర చల్లితే బైగాన్ బార్తా రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

