కాబోయే అమ్మలూ.. చెప్పులతో జాగ్రత్త!
అమ్మాయి అమ్మ కాబోతున్నదని తెలియగానే అనేక జాగ్రత్తలు చెవిన పడతాయి. అందులోనూ నేటితరం వేసుకునే బిగుతు దుస్తులూ, ఎత్తు చెప్పుల గురించి రకరకాల హెచ్చరికలు వినిపిస్తాయి. కాబోయే అమ్మ అలియా భట్ తాజాగా ఓ షూట్లో ఎత్తుచెప్పులు వేసుకుని కనిపించడంతో, అసలు ఈ సమయంలో ఎత్తు చెప్పులు ధరించవచ్చా? అనే విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది
అమ్మాయి అమ్మ కాబోతున్నదని తెలియగానే అనేక జాగ్రత్తలు చెవిన పడతాయి. అందులోనూ నేటితరం వేసుకునే బిగుతు దుస్తులూ, ఎత్తు చెప్పుల గురించి రకరకాల హెచ్చరికలు వినిపిస్తాయి. కాబోయే అమ్మ అలియా భట్ తాజాగా ఓ షూట్లో ఎత్తుచెప్పులు వేసుకుని కనిపించడంతో, అసలు ఈ సమయంలో ఎత్తు చెప్పులు ధరించవచ్చా? అనే విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
గర్భధారణ సమయంలో ఎత్తు చెప్పులు అంత మంచిది కాదన్నది వైద్యుల మాట. నెలలు నిండేకొద్దీ పొట్ట బరువు ఎక్కువ అవుతుంది. ముందుకు చొచ్చుకువస్తుంది కూడా. ఈ పొజిషన్లో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అంతేకాదు, ఎత్తు చెప్పుల కారణంగా శరీరం మీద ఒత్తిడి అధికం అవుతుంది. దీంతో కాళ్ల తిమ్మిరి తోపాటు.. పిక్కలు, నడుము, కటి ప్రాంతాల్లో నొప్పి ఇబ్బంది పెడుతుంది. ప్రెగ్నెన్సీ హార్మోన్ల కారణంగా కీళ్లు, లిగమెంట్లు వదులు అవుతాయి. ఎత్తు చెప్పులు ధరించినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా నడిచినా కిందపడే ప్రమాదం ఉంది. దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరికీ ప్రమాదమే. అంతేకాదు, కడుపుతో ఉన్నప్పుడు శరీరంలో నీరు అధికంగా నిలువ ఉంటుంది. కాళ్లను గట్టిగా పట్టి ఉంచే శాండిల్స్ లేదా ఎత్తు చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలకు నీరు చేరే ఆస్కారమూ ఉందంటారు డాక్టర్లు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

